సాధారణంగా కొందరిలో పిల్లలు కలగక పోవడానికి దోషం ఎవరిలో ఉంది? ఒకప్పుడయితే స్త్రీ గర్భం ధరించలేకపోతే దోషం ఆమెదని, ఆమె గొడ్రాలని, ముద్ర వేసేవారు. మగవాడు పరిపూర్ణుడనే అపోహ ఉండేది. అయితే దంపతుల మధ్య నిస్సారతకు భార్యాభర్తల్లో ఎవరో ఒకరు కారణం కావచ్చు లేదా ఇద్దరూ కారణం కావచ్చు. ఇంకా ఇతర కారణాలు కూడా ఉండొచ్చు. దంపతులలో సంతానం కలగకపోవటానికి భార్యాభర్త లిరువురిలోనూ లోపాలుండవచ్చు, వైద్య పరిభాషలో సంతానం కలగకపోవటానికి 40% వరకు ఆడవారిలో లోపాలుండవచ్చు, లేదా 30% వరకు మగవారిలో లోపాలుండవచ్చు, లేదా 20% వరకు ఇద్దరిలో లోపాలుండవచ్చు, లేదా...