CSS Drop Down Menu

Wednesday, May 11, 2016

భాష రాదని భయమా ? ఐతే ఈ టీష‌ర్ట్ ఉంటే ప్ర‌పంచం మొత్తం చుట్టేయవచ్చు !

ఏదైనా కొత్త ప్రాంతానికి వెళ్లిన‌ప్పుడు స‌హ‌జంగానే ఎవ‌రికైనా అక్క‌డి ప్ర‌జ‌ల భాష అర్థం కాదు. ఒక‌వేళ ఆ భాష ముందుగానే వచ్చి ఉంటే ఎలాంటి ఇబ్బంది లేదు, కానీ రాక‌పోతే మాత్రం తిప్ప‌లు త‌ప్ప‌వు. ఈ క్ర‌మంలో కొత్త ప్ర‌దేశంలో ఏం కావాల‌న్నా, ఏం చేయాల‌న్నా, ఎక్క‌డికి వెళ్లాల‌న్నా భాష కీల‌క పాత్ర పోషిస్తుంది. అయితే ఇప్పుడు మాత్రం ఆ భాష ఇబ్బంది త‌ప్పుతుంద‌నే చెప్ప‌వ‌చ్చు. ఎలా అంటే ఐకాన్ స్పీక్ టీ ష‌ర్ట్‌తో..!




అవును, ఐకాన్ స్పీక్ పేరిట ఇప్పుడు కొత్త‌రకం టీ ష‌ర్టులు ల‌భ్య‌మ‌వుతున్నాయి. ఇంతకీ వీటి వ‌ల్ల ఉప‌యోగం ఏమిటంటారా? అక్క‌డికే వ‌స్తున్నాం. స‌హ‌జంగా మ‌నం నిత్యం చేసే కొన్ని ప‌నుల‌తోపాటు కొత్త ప్రాంతానికి విహారానికై వెళ్లిన‌ప్పుడు హోట‌ల్స్‌, రెస్టారెంట్స్‌, ప‌ర్యాట‌క ప్రాంతాలు, ట్యాక్సీలు, రూమ్‌లు, ఫుడ్ త‌దిత‌ర స‌మాచారం మ‌న‌కు అవ‌స‌ర‌మ‌వుతుంది. అలాంటి సంద‌ర్భాల్లో భాష స‌మస్య వస్తుంటుంది. అయితే దీన్ని సుల‌భంగా ప‌రిష్క‌రించాల‌నే ఉద్దేశంతోనే ఐకాన్ స్పీక్ టీ ష‌ర్టుల‌ను రూపొందించారు. ఈ టీష‌ర్టుల మీద ముందు భాగంలో పైన చెప్పిన ఆయా ప‌నుల‌ను సూచించే ప‌లు ఐకాన్లు ఉంటాయి. ఉదాహ‌ర‌ణ‌కు ఫుడ్‌ని సూచించేందుకు ప్లేట్‌, ఫోర్క్‌, స్పూన్‌ను క‌లిగిన సింబ‌ల్‌, ప్ర‌యాణం కోసం కారు, విమానం, బైక్ సింబ‌ల్స్… అలాగ‌న్న‌మాట‌. ఈ క్ర‌మంలో విహారంలో ఉన్న‌ప్పుడు ఈ టీ ష‌ర్ట్‌ను ధ‌రిస్తే భాష స‌మ‌స్యను సుల‌భంగా ప‌రిష్క‌రించుకునేందుకు వీలుంటుంది. మ‌న‌కు ఏం కావాల‌న్నా ఎదుటి వ్య‌క్తులకు మన టీ ష‌ర్ట్‌పై ఉన్న సింబ‌ల్స్‌ను చూపిస్తే స‌రిపోతుంద‌న్న‌మాట‌.



 
ఇంత‌కీ ఈ ఐకాన్ స్పీక్ టీ ష‌ర్ట్ ధ‌ర ఎంత‌నుకుంటున్నారు?  కేవ‌లం 33 యూఎస్ డాల‌ర్లు మాత్ర‌మే. అంటే మ‌న క‌రెన్సీలో దాదాపు రూ.2,100 అన్న‌మాట‌. ఈ టీష‌ర్ట్‌ను కొనాలంటే ఆన్‌లైన్‌లో ఆర్డ‌ర్ ఇవ్వాల్సి ఉంటుంది. కావాల‌నుకునే వారు https://iconspeak.world/  సైట్‌ను సంద‌ర్శించ‌వ‌చ్చు.

0 comments:

Post a Comment