CSS Drop Down Menu

Friday, October 7, 2016

మగవారిలో ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకండి ?


ప్రొస్టేట్ క్యాన్సర్..!! ఇదో సైలెంట్ కిల్లర్ అని చెప్పవచ్చు. ఎందుకంటే.. ఈ క్యాన్సర్ మగవాళ్లలో మాత్రమే వస్తుంది. ప్రొస్టేట్ క్యాన్సర్ మగవాళ్ల ప్రొస్టేట్ గ్లాండ్స్ పై దుష్ర్పభావం చూపుతుంది. ఈ ప్రొస్టేట్ క్యాన్సర్ ఎక్కువగా 65ఏళ్లలో ఉండే.. మగవాళ్లలో వస్తుంది. కానీ లైఫ్ స్టైల్లో మార్పులు, అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల.. యంగ్ ఏజ్ లోనే.. చాలామంది యువకులు.. ప్రొస్టేట్ క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఈ ప్రొస్టేట్ క్యాన్సర్ లక్షణాలను మొదట్లోనే గుర్తిస్తే.. త్వరగా నయం చేయవచ్చు. ప్రాణాలను కాపాడుకోవచ్చు. ఇప్పుడు చెప్పబోయే లక్షణాల్లో ఏ ఒక్కటి కనిపించినా.. వెంటనే.. డాక్టర్ ని సంప్రదించాలి. ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. మరి మగవాళ్లు నిర్లక్ష్యం చేయకూడని, ప్రొస్టేట్ క్యాన్సర్ లక్షణాలేంటో చూద్దామా..

యూరిన్ కి వెళ్లినప్పుడు, స్ఖలనం అయినప్పుడు.. చాలా మంటగా అనిపించిందంటే.. మగవాళ్లు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. ఇది ప్రొస్టేట్ క్యాన్సర్ సంకేతం అయి ఉండవచ్చు. కాబట్టి వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి.

మగవాళ్లలో చాలా తరచుగా.. యూరిన్ కి వెళ్తున్న లక్షణం కనిపించిందంటే.. ఎట్టిపరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకండి.

కీళ్ల నొప్పులతో పాటు, తొడలు పట్టేసినట్టు అనిపించడం, ప్రక్కటెముకల్లో నొప్పి, పొత్తి కడుపు, వెన్నెముక కింది వైపు నొప్పి ఉంటే.. ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు.

మగవాళ్లకు యూరిన్ లో లేదా, వీర్యంలో బ్లడ్ కనిపించిందంటే.. ఎట్టిపరిస్థితుల్లో నిర్లక్ష్యం చేయకూడదు. ఇది డేజంరస్ సంకేతమని గ్రహించండి.

ధీర్ఘకాలికంగా బ్యాక్ పెయిన్ తో బాధపడుతున్నారంటే.. దానికి చాలా సంకేతాలు ఉంటాయి. కానీ.. అది ప్రొస్టేట్ క్యాన్సర్ కి కూడా లక్షణం అయి ఉండవచ్చు. కాబట్టి ఒకసారి డాక్టర్ ని సంప్రదించడం మంచిది.

యూరిన్ చేసేటప్పుడు నిలబడటం ఏమాత్రం సాధ్యం కావడం లేదు అంటే.. అది.. ప్రొస్టేట్ క్యాన్సర్ కి లక్షణం అయి ఉండవచ్చు. కాబట్టి మగవాళ్లు ఈ లక్షణాన్ని నిర్లక్ష్యం చేయకూడదు.

మూత్ర ప్రవాహాన్ని ఆపలేకపోవడం లేదా.. మొదలుపెట్టడానికి చాలా కష్టంగా మారింది అంటే.. ఈ లక్షణాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ప్రొస్టేట్ క్యాన్సర్ కి లక్షణం అయి ఉండే అవకాశం ఉంది.
  

0 comments:

Post a Comment