ఇప్పుడు ఎక్కడ చూసినా 4జి అనే మాట వినిపిస్తోంది. జియో సిమ్ వేసుకోవాలంటే, మీ సెల్ ఫోన్ 4Gయేనా అని అడుగుతున్నారు. కాదు 3జి అంటే, అయితే సపోర్ట్ చేయదంటున్నారు... అయినా మీరు బెంగపెట్టుకోవాల్సిన పనిలేదు. మీ ఫోన్ 4జిగా ఇలా మార్చేసుకోవచ్చు.
మొన్నటిదాకా 3G ఫోన్‌కి, 4G ఫోన్‌కి మధ్య పెద్దగా వ్యత్యాస్యం చూడలేదు జనాలు. కాని జియో రాకతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. జియో కేవలం 4G నెట్వర్క్‌కి సంబంధించిన సేవలు అందిస్తోంది. దీనికి కారణం జియో పూర్తిగా LTE నెట్వర్క్ పైన ఆధారపడటం. అలాగే VoLTE ఉన్న ఫోన్‌కి మాత్రమే ఎలాంటి ఆప్స్ సహాయం లేకుండా జియో కాల్స్ సౌకర్యం లభిస్తోంది. కాల్స్ పక్కనపెడితే, ఇప్పుడు అందరికి అవసరమైనది 4G ఇంటర్నెట్ సర్వీసులు. వీటిని 3G ఫోన్స్ ఉన్నవారు పొందలేకపోతున్నారు. మరి ఎలా? మీ 3G ఫోన్‌ని 4Gకి మార్చుకోవచ్చిలా.
అన్ని ఫోన్లకి ఇది సాధ్యపడదు కాని, మేం చెప్పే ఓ ట్రిక్ అయితే ప్రయత్నించి చూడండి. పని చేస్తే మీ లక్. మీ 3G మొబైల్‌లో *#*#4636#*#* డయల్ చేయండి. ఆ తరువాత మీ ఫోన్లో Phone Information, Battery Information, Usage Satistics, Wi-Fi information అనే ఆప్షన్లు కనిపిస్తే సగం పని అయిపోయినట్టే. ఆ తరువాత Phone Informationలోకి వెళ్ళి "set preferred network type"ని సెలెక్ట్ చేయండి. దాంట్లో కొన్ని ఆప్షన్స్ వస్తాయి. వాటిలోంచి LTE/GSM/CDMA auto (PRL)ని సెలెక్ట్ చేసుకోని అప్డేట్ చేయండి. ఓసారి ఫోన్ రిబూట్ లేదా స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేయండి. ఇప్పుడు ఏదైనా 4G సిమ్ వేసి ఇంటర్నెట్ కనెక్ట్ అవుతోందో లేదో పరీక్షించండి. అన్నీ అనుకున్నట్టుగానే జరిగితే, మీరు జియో 4Gని మీ 3G ఫోన్లో వాడుకోవచ్చు.
0 comments:
Post a Comment