మొదటినుంచీ మలయాళీ చిత్ర పరిశ్రమ ఒక ప్రత్యేకమే. ప్రయోగాలకూ, ఆర్ట్ సినిమాలకూ కేరళ ఫిలిం మేకర్లు ఎంత ప్రసిద్దో. బీ గ్రేడ్ సినిమాలకూ అంతే. ఇప్పుడా సినిమాల సంగతి వదిలేస్తే. కొత్త కొత్త ఐడియాలతో ప్రయోగాలు చేయటానికి బెంగాలీ ఇండస్ట్రీ తర్వాత దక్షిణాదిలో మల్లూవుడ్ దే పైచేయి. బడ్జెట్ మరీ ఎక్కువ ఉండదు, హీరోలకు మరీ కోట్లకొద్దీ డబ్బులు దారపోయరు. తక్కువ బడ్జెట్ లో నష్టాలు పెద్దగా ఉందవు కాబట్టి ప్రయోగాలకు మనలా ఎక్కువ వెనుకాడరు. మళయాళ దర్శకులు, నటులు కూదా నటన అంటే ఎంతో ఇష్టం ఉన్నట్టు కనిపిస్తారు. అందుకే మల్లూవుడ్ లో ఎప్పుడు చూసినా పలువురు దర్శకులు రకరకాల ప్రయోగాలతో సినిమాలు రూపొందిస్తుంటారు.
అదే కోవలో ఇప్పుడు మలయాళంలో ఓ సరికొత్త తరహా కథాచిత్రం వస్తోంది. 'తిరైక్కు వరదా కథై' అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో కేవలం మహిళా పాత్రలే వుంటాయట. అసలు మగపురుగన్నదే కనిపించకుండా సినిమా ప్లాన్ చేసారట . సరే కనిపించకపోతే పోయే, మాటల్లో కూడా ఎక్కడా అసలు మగవాసన తగలకుండా జాగ్రత్త పడ్డారట. మేల్ అన్న ఊసే లేని మేలుజాతి సినిమా తీసేద్దామనుకున్నారో ఏమో గానీ దెయ్యం చుట్టూ తిరిగే కథతో ఇది సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందనుంది.

ఇందులో ఒకప్పటి గ్లామర్ హీరోయిన్ ఇప్పటికీ గ్లామర్ ని మాత్రం అలాగే ఉంచుకున్న ఆర్టిస్ట్ నదియా ముఖ్య పాత్రలో కనిపించనుంది. ఈ చిత్ర దర్శకుడు తులసీదాస్ ఈ సందర్భంగా చెబుతూ, "అసలు ఇందులో పురుష పాత్రలనేవే అస్సలు కనిపించవు. కథ బ్యాక్ గ్రౌండులో కూడా అసలెక్కడా మగపాత్రల ప్రస్తావన కూడా రాదు. నదియా, ఇనేయా ఇద్దరూ కీలక పాత్రలు పోషిస్తున్నారు' అని చెప్పారు. మలయాళంతో పాటు తమిళ వెర్షన్ ను కూడా ఏకకాలంలో నిర్మిస్తారట. తెలుగు డబ్బింగ్ ఎలానూ ఉంటుంది కాబట్టి మనమూ ఈ ఫిమేల్ సినిమా చూసే చాన్సుంది.
0 comments:
Post a Comment