చైనాలో వ్యాపారస్థులు వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే అమ్మాయిలను అంగడివస్తువుల్లా మార్చి అన్నింటికి లోదుస్తులకు కూడా ఆడవారితోనే ప్రకటనలు వస్తున్న తరుణంలో యావత్ ప్రపంచ వ్యాప్తంగా ప్రకటనకర్తలపై విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ.. చైనా మరో వినూత్న వికృత పోకడలకు వెళ్లి ప్రపంచ విమర్శకుల నుంచి తిట్లు తిట్టించుకుంటోంది.
పక్కా క్యాపిటలిస్టులమని చెప్పుకునే దేశాలు సైతం ఈ తరహా విపరీత పోకడలకు దూరంగా ఉంటున్న తరుణంలో చైనీస్ కంపెనీ మాత్రం మరో అడుగు ముందుకేసి మరీ అడవారిని అంగడి సరుకుగా మార్చింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక సంఘటనపై చైనా దేశ పౌరులేకాక యావత్ ప్రపంచం సైతం భగ్గుమంటుంది. చైనా - హాంకాంగ్‌లలో ప్రతి రోజూ కోట్లాది రూపాయల విలువైన ఆభరణాలను విక్రయించే "చావ్ లుక్ ఫొక్" అతిపెద్ద జువెలరీ కంపెనీ. ఈ కంపెనీ ఈ మధ్యకాలంలో కొత్త మోడల్ వజ్రాలను మార్కెట్‌లోకి విడుదల చేసింది.

ఆ వజ్రాలకు ప్రచారం కల్పించడంలో భాగంగా స్టోర్లలో పనిచేసే అమ్మాయిలను ఆఫ్ న్యూడ్ షో రూం బొమ్మల్లా మార్చేసింది. కొత్త డైమండ్లను సూచిస్తూ ఒంటి పైభాగంలో అచ్ఛాదనలేని అమ్మాయిలను జ్యువెలరీ స్టోర్లలో నిలబెట్టింది. ఈ రకంగా కస్టమర్లను ఆకట్టుకోవాలనే నీచమైన పనికి చైనా ఒడిగట్టింది. షాపులో ప్రవేశిస్తే చాలు, అసభ్యకరంగా నిల్చున్న అమ్మాయిలు దర్శనమిస్తారు. ఇది చూసి కొనుగోలుదారులంతా అవాక్కయ్యారు.
కొందరైతే కంపెనీ తీరును బాహాటంగానే తప్పుపట్టారు. ఇక ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లు సైతం చైనా కంపెనీ తీరును తప్పుపడుతున్నారు. ఇక నెటిజన్లు అయితే చైనా కంపెనీ తీరును ఏకిపారేస్తున్నారు. ఏ రకంగా చూసినా ఈ ఆభరణాల కంపెనీ చర్య సమర్థనీయం కాదని దీని లైసెస్సులను రద్దుచేయాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ చైనా ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు.
0 comments:
Post a Comment