కొన్ని సందర్భాల్లో రైలు ప్రయాణం రద్దు చేసుకోవల్సి రావడమో లేదా టిక్కెట్ పై ప్రయాణించకపోవడమో జరుగుతోంది. ఆ సమయంలో టిక్కెట్ రద్దు చేసుకోవటం వీలుపడక చాలా మంది ఆ టిక్కెట్లను అలాగే వదిలేస్తుంటారు. దీని వల్ల వినియోగదారులు టిక్కెట్ రుసుము పూర్తిగా నష్టపోవాల్సి వస్తోంది. దీన్ని నివారించేందుకు ఇండియన్ రైల్వేస్ ఓ వినూత్న అవకాశాన్ని కల్పిస్తోంది. ఒక్క ఫోన్ కాల్ తో రైల్వే టిక్కెట్ రద్దు చేసుకునేలా కొత్త సాఫ్ట్ వేర్ ను అభివృద్ది చేసింది.
ఈ వెసులుబాటు వచ్చే నెల నుంచే అమల్లోకి వచ్చే అవకాశం ఉందని రైల్వే శాఖ అధికారులు చెబుతున్నారు. దీని ప్రకారం వినియోగదారులు మొబైల్ ఫోన్ నుంచి 139 నెంబర్ కు ఫోన్ చేసి టిక్కెట్లు రద్దు చేసుకోవచ్చు. ఈ నెంబర్ కు ఫోన్ చేసి వివరాలు చెప్తే టిక్కెట్ రద్దు అవుతుంది. వెంటనే ఫోన్ కు ఓ పాస్ వర్డ్ వస్తుంది. దీని ద్వారా టిక్కెట్ డబ్బులు వాపస్ పొందవచ్చు.
0 comments:
Post a Comment