త్వరలో కండోమ్స్‌కి గుడ్‌బై చెప్పే రోజులు వస్తున్నాయా? అవుననే అంటున్నారు పరిశోధకులు. సైడ్ ఎఫెక్ట్స్ కలిగించే గర్భనిరోధక మాత్రలను వేసుకోవాల్సిన పనే వుండదంటున్నారు. ఇందుకు సంబంధించి చాలావరకు సక్సెస్ అయ్యిందని.. కాకపోతే సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా నివారించేందుకు పరిశోధనలు జరుగుతున్నాయి. ఆ ఇంజెక్షన్స్ అందుబాటులోకి వస్తే.. గర్భం వస్తుందన్న భయం లేకుండా హాయిగా రొమాన్స్‌లో మునిగి తేలవచ్చునట! ఒక్క ఇంజెక్షన్‌తో అది సాధ్యమంటున్నారు వైద్య నిపుణులు.
పురుషులు ఎనిమిది వారాలకోసారి రెండు హార్మోన్ ఇంజక్షన్లు వేయించుకుంటే చాలట. ఈ ఇంజక్షన్లతో పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ (శుక్రకణాల సంఖ్య)ను తగ్గిపోయేలా చేయవచ్చని ఢిల్లీలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ శాస్త్రవేత్త మన్మోహన్ మిస్రో టీమ్ వెల్లడించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన మారియో ఫిలిప్ అనే శాస్త్రవేత్తతో కలిసి మిస్రో టీం చేసిన పరిశోధనల్లో ఈ విషయం రుజువైంది. ట్రయిల్ రన్‌లో 18 ఏళ్ల నుంచి 45 ఏళ్ల మధ్య ఇంజక్షన్లు తీసుకున్న 270 మంది పురుషుల్లో సుమారు 96 శాతం సమర్థంగా పనిచేశాయని తేలింది. కేవలం నలుగురి భార్యలకు మాత్రమే గర్భం వచ్చిందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.
ఐతే, ఈ ఇంజెక్షన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ లేకపోలేదు. కండరాల నొప్పి, మొటిమలు వంటి దుష్ప్రభావాలు రావడంతో నివారించేందుకు తదుపరి పరిశోధనలు కొనసాగిస్తున్నారు. ఇది కూడా సక్సెస్ అయిపోతే.. కండోమ్స్ కంపెనీల ఆదాయం పడిపోయే ఛాన్స్ వుందని అంటున్నారు. ఇంజెక్షన్ ద్వారా కండోమ్ కంపెనీల కోట్ల ఆదాయానికి గండిపడే అవకాశముందని మార్కెట్ విశ్లేషకుల అంచనా!
0 comments:
Post a Comment