CSS Drop Down Menu

Monday, October 31, 2016

"కంమ్స్‌"డోకి గుడ్‌బై చెప్పే రోజులు వస్తున్నాయా?

త్వరలో కండోమ్స్‌కి గుడ్‌బై చెప్పే రోజులు వస్తున్నాయా? అవుననే అంటున్నారు పరిశోధకులు. సైడ్‌ ఎఫెక్ట్స్‌ కలిగించే గర్భనిరోధక మాత్రలను వేసుకోవాల్సిన పనే వుండదంటున్నారు. ఇందుకు సంబంధించి చాలావరకు సక్సెస్ అయ్యిందని.. కాకపోతే సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా నివారించేందుకు పరిశోధనలు జరుగుతున్నాయి. ఆ ఇంజెక్షన్స్ అందుబాటులోకి వస్తే.. గర్భం వస్తుందన్న భయం లేకుండా హాయిగా రొమాన్స్‌లో మునిగి తేలవచ్చునట! ఒక్క ఇంజెక్షన్‌తో అది సాధ్యమంటున్నారు వైద్య నిపుణులు.  పురుషులు ఎనిమిది వారాలకోసారి రెండు హార్మోన్‌ ఇంజక్షన్లు వేయించుకుంటే చాలట. ఈ ఇంజక్షన్లతో పురుషుల్లో స్పెర్మ్‌...

Saturday, October 29, 2016

"రెండుసార్లు పుట్టిన పాప" ఎక్కడో తెలుసా ?

ఇదేంటి పాప రెండుసార్లు పుట్టిందా? ఏ తల్లైనా బిడ్డకు ఒక్కసారేగా జన్మనిస్తుందనే డౌట్ కలిగింది కదా. అయితే చదవండి. అమెరికాలో తల్లి గర్భ సంచి నుంచి రెండుసార్లు జన్మించిన శిశువుకు సంబంధించిన వార్తలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. టెక్సాస్‌లోని చిల్ట్రన్స్ హాస్పిటల్‌లో ఈ అరుదైన ఘటన జరిగింది. టెక్సాస్‌కు చెందిన ఓ గర్భిణి ప్రసవ వేదనతో ఈ ఆసుపత్రిలో చేరింది. కానీ గర్భస్థ శిశువుకు ట్యూమర్ పెరిగినట్లు వైద్యులు గుర్తించారు. దీంతో బిడ్డ కడుపులో ఉండగానే పిండాన్ని బయటకు తీసి ఆ ట్యూమర్‌ను తొలగించారు. ట్యూమర్ వల్ల దాదాపు బిడ్డ గుండె ఆగినంత పనైంది....

Friday, October 28, 2016

యజమానా మజాకా ! "దీపావళి బోనస్‌" గా ఏమిచ్చాడో తెలుసా ?

సాధారణంగా పండుగలకి ఉద్యోగులకి బోనస్ లు ప్రకటిస్తుంటారు. అయితే ఇచ్చే జీతంతోపాటు ఏదో ఒక వెయ్యో.. రెండు వేలో బోనస్ గా ఇస్తుంటారు. కానీ ఇక్కడ ఓ యజమాని మాత్రం ఏకంగా... ఉద్యోగులకు 400 ఫ్లాట్లు.. 1200 కార్లు ఇచ్చాడు. వివరాల ప్రకారం... తన  కోసం తన కొడుకును నెల రోజుల పాటు సామాన్యుడిలా కష్టపడి పనిచేసి రావాలని బయటకు పంపేసిన సూరత్ కోటీశ్వరుడు గుర్తున్నాడు కదూ. అతనే మన దేశంలో పేరుమోసిన వజ్రాల వ్యాపారి సావ్ జీ ఢోలాకియా. హరేకృష్ణ ఎక్స్‌పోర్ట్స్ అనే పేరుతో...

Thursday, October 27, 2016

మందుబాబులకు దివ్యౌషధం "బీరకాయ"

బీరకాయలో ఉన్న మేలెంతో తెలుసుకుంటే.. అస్సలు దాన్ని వదిలిపెట్టరు. సాధారణ, నేతి బీరకాయ- రెండు రకాల కాయల్లోనూ పీచు, విటమిన్‌-సి, జింక్‌, ఐరన్‌, రిబోఫ్లేవిన్‌, మెగ్నీషియం, థైమీన్‌... వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. బీరకాయలోని పెప్టైడ్స్, ఆల్కలాయిడ్స్ రక్తంలోని, యూరిన్‌లోని చక్కెర నిల్వల శాతాన్ని చాలామటుకు తగ్గించేందుకు తోడ్పడతాయి.  బీరకాయ రక్తశుద్ధికీ కాలేయ ఆరోగ్యానికీ కూడా తోడ్పడుతుంది. ఆల్కహాల్‌ వల్ల దెబ్బతిన్న కాలేయాన్నీ రక్షిస్తుంది....

Friday, October 21, 2016

అమ్మవారి దర్శనం కోసం వచ్చే ఎలుగుబంట్లు !

చత్తీస్‌గడ్‌లోని అమ్మవారి దేవాలయంలో జరిగే వింత ఇది. ఇక్క‌డికి నిత్యం భ‌క్తులు వ‌చ్చి అమ్మ‌వారికి పూజ‌లు చేస్తారు. ఇందులో విశేషం ఏముంది... కానీ, ప్రతి రోజు ఉదయాన్నే ఎలుగుబంట్లు అమ్మవారి దర్శనం కోసం వచ్చి నిలబడ‌తాయి. మనుషుల మాదిరిగానే చేతులు జోడించి దణ్ణం పెట్టుకుంటాయి.  హారతి ఇచ్చి, ప్రసాదం పెట్టిన తరువాత అక్కడ నుంచి వెళ్ళిపోతాయి. మిగతా భ‌క్తులెవ‌రికీ అవి హాని తలపెట్టవు, అప్పుడప్పుడు వాటి పిల్లలను కూడా గుడికి తీసుకొని వస్తాయి. ఆల‌యంలో...

Thursday, October 20, 2016

"ఆవు నెయ్యి"తో బోల్డన్ని ఉపయోగాలు !

హిందువులకు ఎంతో పవిత్రమైనది గోమాత. ఆవులో అనేకమంది దేవతలు కొలువున్నారని గోమాతను పూజిస్తారు. ఆవు పాలు, పెరుగు, నెయ్యి, మూత్రం, మలములో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఆవు నెయ్యిని క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకోవడం ద్వారా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. పడుకోబోయే ముందు వేడి పాలలో ఓ చెంచాడు ఆవు నెయ్యి వేసుకుని తాగితే జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. ఉదయానికి విరోచనం సాఫీగా అవుతుంది.  రోజుకు ఓ స్పూన్ ఆవు నెయ్యి భోజనంలో తీసుకుంటే చిన్న పిల్లల మెదడు ఎదుగుదలకు బాగా ఉపయోగపడుతుంది. ఆవు నెయ్యి కేన్సర్ వ్యాధిగ్రస్తులకు బాగా ఉపయోగ...

Tuesday, October 18, 2016

"కొబ్బరి ఆకు"తో కళాకృతులు !

...

Saturday, October 15, 2016

"బరువు తగ్గాలను"కునే వారికీ సులువైన చిట్కా !

బరువు తగ్గాలనుకునుకుంటున్నారా? వ్యాయామాలు చేసేస్తున్నారా? ఇకపై ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. కేవలం రెండు గ్లాసుల నీరు చాలు. ఇదేంటి అనుకుంటున్నారా? ఈ స్టోరీ చదవండి. భోజనానికి ముందు రెండు గ్లాసుల నీరు తాగితే సులభంగా బరువు తగ్గుతారని లండన్ పరిశోధకులు తేల్చారు. భోజనానికి ముందే నీరు తాగడం వల్ల కడుపు నిండిన అనుభూతి పొందుతారని దీంతో ఆహారం తక్కువగా తింటారని తద్వారా బరువు తగ్గుతారని తేలింది. ప్రాథమిక ఆధారాలతో బర్మింగ్‌హామ్ వర్శిటీకి చెందిన పరిశోధకులు ఈ విషయాన్ని వెల్లడించారు. ఇలా భోజనానికి ముందు నీరు తాగేవారు 3 నెలల్లోనే 4కిలోల బరువు తగ్గారని అధ్యయనం...

Friday, October 14, 2016

మీ "3G ఫోన్‌" ని "4G ఫోన్‌" గా ఇలా మార్చుకోండి !

ఇప్పుడు ఎక్క‌డ చూసినా 4జి అనే మాట వినిపిస్తోంది. జియో సిమ్ వేసుకోవాలంటే, మీ సెల్ ఫోన్ 4Gయేనా అని అడుగుతున్నారు. కాదు 3జి అంటే, అయితే స‌పోర్ట్ చేయ‌దంటున్నారు... అయినా మీరు బెంగ‌పెట్టుకోవాల్సిన ప‌నిలేదు. మీ ఫోన్ 4జిగా ఇలా మార్చేసుకోవ‌చ్చు. మొన్నటిదాకా 3G ఫోన్‌కి, 4G ఫోన్‌కి మధ్య పెద్దగా వ్యత్యాస్యం చూడలేదు జనాలు. కాని జియో రాకతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. జియో కేవలం 4G నెట్వర్క్‌కి సంబంధించిన సేవలు అందిస్తోంది. దీనికి కారణం జియో పూర్తిగా LTE నెట్వర్క్ పైన ఆధారపడటం. అలాగే VoLTE ఉన్న ఫోన్‌కి మాత్రమే ఎలాంటి ఆప్స్ సహాయం లేకుండా జియో కాల్స్ సౌకర్యం...

Thursday, October 13, 2016

"KCR" అంటే ఏమిటో తెలుసా ?

సిద్ధిపేట జిల్లా ప్రారంభోత్సవం సందర్భంగా తెలంగాణ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు కాస్తంత ఉద్విగ్నతకు లోనయ్యారు. సీఎం కేసీఆర్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. మంగళవారం సిద్ధిపేట జిల్లా ప్రారంభోత్సవం అనంతరం ఆయన కేసీఆర్ గురించి మాట్లాడారు.  కేసీఆర్ అంటే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కాదని KCR అంటే ఏమిటో నిర్వచించారు.  K అంటే KNOWLEDGE(జ్ఞానము),  C అంటే COMMITMENT(నిబద్ధత), R అంటే RECONSTRUCTION(తెలంగాణ పునర్నిర్మాణం) అని తెలిపారు.  ఈ మూడింటిని నిజం చేసిన కేసీఆర్‌కు శిరసు వంచి పాదాభివందనం చేశారు. ...

Wednesday, October 12, 2016

నిన్నటి "భిక్షగాడు" నేడు "కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ"లో సీట్ సంపాదించాడు !

జ‌య‌వేల్ సొంత ఊరు ఆంద్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా. ఇతను పుట్టే నాటికి వారికి కొంత పంట పొలాలు ఉండేవి కానీ 1980 లో వచ్చిన వరదలకు పంటలు కొట్టుకుపోవడంతో వారి కుటుంబంపై ఒక పెను ప్రభావాన్ని చూపించింది. పూట గడవడమే చాలా కష్టంగా మారుతున్నా రోజులు, ఇక ఇక్కడ ఉంటే బ్రతకడమే కష్టం అవుతుందని వారి కుటుంబం చెన్నైకి వలసపోయింది. అక్కడికి వెళ్లిన కొన్ని రోజులకి జ‌య‌వేల్ నాన్న చనిపోయారు. ఎలాంటి పరిస్థితిలలో చెన్నైకి వచ్చారో మళ్లీ అలాంటి పరిస్థితే ఎదురైంది జయవెల్ అమ్మకి, తనకి. వాళ్ళ నాన్న చనిపోయిన తరవాత తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు లేని సమయంలో తన...

Saturday, October 8, 2016

సర్జరీ లేకుండానే బ్రెస్ట్‌ సైజును పెంచే 'బ్రా'

సాధారణంగా మహిళలు తమ ఛాతి పరిమాణ విషయంలో ఎంతో ఒత్తిడికి గురవుతుంటారు. వక్షోజాలు తగినంత పరిమాణంలో లేకపోతే చాలా బాధపడుతుంటారు. మరికొంత మంది శస్త్రచికిత్స చేయించుకుని పాలిండ్ల సైజుల్ని పెద్దవిగా చేయించుకుంటారు. అయితే ఇకపై ఆ అవసరం లేదు. ఎందుకంటే సర్జరీ లేకుండానే బ్రెస్ట్‌ సైజును పెంచే "మిరాకిల్‌ వైబ్రేటింగ్‌ బ్రా"ను సెర్బియాకు చెందిన ఓ ఇంజనీర్‌ కనిపెట్టాడు. దీన్ని కేవలం రోజుకో గంట ధరిస్తే చాలు వారంలో ఫలితం కనిపిస్తుందట. సెర్బియాకు చెందిన మిలాన్‌ మిలిక్‌ అనే ఇంజనీరు గర్ల్ ఫ్రెండ్ తన బ్రెస్ట్‌ విషయంలో ఎప్పుడూ అసంతృప్తికి గురవుతూ ఉండేది. దీంతో ఆమె...

Friday, October 7, 2016

మగవారిలో ఈ లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకండి ?

ప్రొస్టేట్ క్యాన్సర్..!! ఇదో సైలెంట్ కిల్లర్ అని చెప్పవచ్చు. ఎందుకంటే.. ఈ క్యాన్సర్ మగవాళ్లలో మాత్రమే వస్తుంది. ప్రొస్టేట్ క్యాన్సర్ మగవాళ్ల ప్రొస్టేట్ గ్లాండ్స్ పై దుష్ర్పభావం చూపుతుంది. ఈ ప్రొస్టేట్ క్యాన్సర్ ఎక్కువగా 65ఏళ్లలో ఉండే.. మగవాళ్లలో వస్తుంది. కానీ లైఫ్ స్టైల్లో మార్పులు, అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల.. యంగ్ ఏజ్ లోనే.. చాలామంది యువకులు.. ప్రొస్టేట్ క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఈ ప్రొస్టేట్ క్యాన్సర్ లక్షణాలను మొదట్లోనే గుర్తిస్తే.. త్వరగా నయం చేయవచ్చు. ప్రాణాలను కాపాడుకోవచ్చు. ఇప్పుడు చెప్పబోయే లక్షణాల్లో ఏ ఒక్కటి కనిపించినా.....

Thursday, October 6, 2016

"మగాళ్ళే కాదు, మగ అనే మాట"కూడా లేని సినిమా !

మొదటినుంచీ మలయాళీ చిత్ర పరిశ్రమ ఒక ప్రత్యేకమే. ప్రయోగాలకూ, ఆర్ట్ సినిమాలకూ కేరళ ఫిలిం మేకర్లు ఎంత ప్రసిద్దో. బీ గ్రేడ్ సినిమాలకూ అంతే. ఇప్పుడా సినిమాల సంగతి వదిలేస్తే. కొత్త కొత్త ఐడియాలతో ప్రయోగాలు చేయటానికి బెంగాలీ ఇండస్ట్రీ తర్వాత దక్షిణాదిలో మల్లూవుడ్ దే పైచేయి. బడ్జెట్ మరీ ఎక్కువ ఉండదు, హీరోలకు మరీ కోట్లకొద్దీ డబ్బులు దారపోయరు. తక్కువ బడ్జెట్  లో నష్టాలు పెద్దగా ఉందవు కాబట్టి ప్రయోగాలకు మనలా ఎక్కువ వెనుకాడరు. మళయాళ దర్శకులు, నటులు కూదా నటన అంటే ఎంతో ఇష్టం ఉన్నట్టు కనిపిస్తారు. అందుకే మల్లూవుడ్ లో ఎప్పుడు చూసినా పలువురు దర్శకులు...

Wednesday, October 5, 2016

ఇకపై రైల్వే టిక్కెట్ రద్దు చేసుకోవడం ఎంతో సులువు !

కొన్ని సందర్భాల్లో రైలు ప్రయాణం రద్దు చేసుకోవల్సి రావడమో లేదా టిక్కెట్ పై ప్రయాణించకపోవడమో జరుగుతోంది. ఆ సమయంలో టిక్కెట్ రద్దు చేసుకోవటం వీలుపడక చాలా మంది ఆ టిక్కెట్లను  అలాగే వదిలేస్తుంటారు. దీని వల్ల వినియోగదారులు టిక్కెట్ రుసుము పూర్తిగా నష్టపోవాల్సి వస్తోంది. దీన్ని నివారించేందుకు ఇండియన్ రైల్వేస్ ఓ వినూత్న అవకాశాన్ని కల్పిస్తోంది. ఒక్క ఫోన్ కాల్ తో రైల్వే టిక్కెట్ రద్దు చేసుకునేలా కొత్త సాఫ్ట్ వేర్ ను అభివృద్ది చేసింది. ఈ వెసులుబాటు వచ్చే నెల నుంచే అమల్లోకి వచ్చే అవకాశం ఉందని రైల్వే శాఖ అధికారులు చెబుతున్నారు. దీని ప్రకారం వినియోగదారులు...

Tuesday, October 4, 2016

"తలతిరగడం" తగ్గించే సులువైన మార్గాలు !

శరీరం లేదా మనస్సు బ్యాలెన్స్ (సమతౌల్యంను) కోల్పోయినప్పుడు ఇలా జరగడం సహజం అయితే ఇది వ్యాధి మాత్రం కాదు. ఇది లోబ్లడ్ ప్రెజర్, డీహైడ్రేషన్,మైగ్రేన్ తలనొప్పి, ఆందోళన వంటి డిజార్డర్స్ వల్ల కలిగే లక్షణాలు, అలాగే తలకుగాయాలు తగిలినప్పుడు కూడా ఇలాంటివిజరుగుతుంటాయి. తలతిరుగుడుకు కొన్ని బేసిక్ ప్రికాషన్స్ ఉన్నాయి. ఇవి తల తిరగడం నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతాయి. తలతిరుగుడు నివారించడానికి కొన్ని నేచురల్ హోం రెమెడీస్ అందుబాటులో ఉన్నాయి. వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇవి శరీరానికి ఎలాంటి హాని కలిగించవు, కాబట్టి తలతిరుగుడు తగ్గడానికి ఈ క్రింది సూచించిన...

Monday, October 3, 2016

"ఆ విషయం" గుర్తొచ్చినప్పుడల్లా తారక్‌ని తిట్టుకుంటానన్న రాజమౌళి !

'స్టూడెంట్ నెంబర్ 1' షూటింగ్‌కు స్విట్జర్లాండ్‌కు వెళ్లగా.. అక్కడ తారక్‌కు, తనకు ఒకే రూమ్ ఇచ్చారని... అయితే.. తనకు మాత్రం 9 గంటలకే నిద్రపోవడం అలవాటని.. తారక్‌కి రాత్రి 12 గంటల వరకు టీవీ చూసే అలవాటని చెప్పాడు. అది కూడా వ్యవసాయ కార్యక్రమాలు చూస్తాడని.. స్విట్జర్లాండ్‌లో ఒకే ఛానెల్‌లో ఆ కార్యక్రమాలు ప్రసారమయ్యేవని చెప్పాడు. అయితే.. 'అది ఎప్పుడు గుర్తొచ్చినా తారక్‌ని తిట్టుకుంటాను' అని రాజమౌళి చెప్పారు.  ...

Saturday, October 1, 2016

వజ్రాల ప్రమోషన్ కోసం అమ్మాయిలతో న్యూడ్ ప్రదర్శన !

చైనాలో వ్యాపారస్థులు వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. ఇప్పటికే అమ్మాయిలను అంగడివస్తువుల్లా మార్చి అన్నింటికి లోదుస్తులకు కూడా ఆడవారితోనే ప్రకటనలు వస్తున్న తరుణంలో యావత్ ప్రపంచ వ్యాప్తంగా ప్రకటనకర్తలపై విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ.. చైనా మరో వినూత్న వికృత పోకడలకు వెళ్లి ప్రపంచ విమర్శకుల నుంచి తిట్లు తిట్టించుకుంటోంది.  పక్కా క్యాపిటలిస్టులమని చెప్పుకునే దేశాలు సైతం ఈ తరహా విపరీత పోకడలకు దూరంగా ఉంటున్న తరుణంలో చైనీస్ కంపెనీ మాత్రం మరో అడుగు ముందుకేసి మరీ అడవారిని అంగడి సరుకుగా మార్చింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఒక సంఘటనపై చైనా దేశ పౌరులేకాక...