CSS Drop Down Menu

Saturday, October 4, 2014

"బీర్" తాగితే "ఎముకలు" గట్టిపడతాయా ?

  
బీర్ తాగితే ఎముకలు గట్టిపడతాయట! ఆశ్చర్యపోకండి. చాలా సంవత్సరాల నుండి డ్రింక్ చేసేవారు బీర్ వారి ఆరోగ్యానికి ప్రమాదకరం అనే అపరాధభావంతో మునిగిపోతున్నారు. అయితే, అధిక మద్యపానం సమస్యలకు దారితీస్తుంది. కానీ మితంగా త్రాగటం అనేది అనేక విధాలుగా మంచిది. తాజా అధ్యయనాల ప్రకారం బీర్‌ను ప్రతి రోజు తీసుకోవటం వలన పురుషులలో మూత్రపిండాల్లో రాళ్ల అభివృద్ధి ప్రమాదాన్ని తగ్గిస్తుందని తెలిసింది.

ముదురు రంగు బీర్‌లో చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడే కరిగే ఫైబర్ ఉంటుంది. బీర్‌లో బి‌12 మరియు ఫోలిక్ ఆమ్లం ఉంటుంది. ఇది బీర్ త్రాగని వారి కంటే త్రాగే వారిలో ఎక్కువగా కనిపిస్తుంది. బీర్‌లో నీటి కంటే మెరుగైన హైడ్రేట్లు ఉన్నాయి. అందువల్ల దీనిని ఆధునిక వినియోగంగా అథ్లెట్ల ఆహారంలో ఒక భాగంగా సిఫార్సు చేయబడింది. బీర్‌లో సిలికాన్ సమృద్దిగా ఉంటుంది. అందువల్ల ఎముకల సాంద్రతను పెంచుతుంది. అలాగే ఎముకలను బలంగా ఉంచుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

0 comments:

Post a Comment