బొప్పాయి పండంటే ఇష్టం లేకపోయినా
తినాల్సిందే! అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. కొందరు బొప్పాయి అంటేనే విముఖత
చూపుతారు. కానీ, ఇందులో ఉండే పోషక విలువల గురించి తెలుసుకుంటే మాత్రం
తప్పకుండా తినేస్తారు.
ధర తక్కువతో కూడిన బొప్పాయిలో ఉండే పీచు
పదార్థం హై కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. అంతేకాకుండా ఈ పీచు పదార్థం
పెద్దపేగు క్యాన్సర్ ముప్పు తగ్గించడంలోనూ సాయపడుతుందని కొన్ని అధ్యయనాలు
చెబుతున్నాయి.
అజీర్తితో బాధపడేవారికి ఇది దివ్యౌషధం. ఇక,
ఇందులో విటమిన్ సి, విటమిన్ ఏ ఉంటాయి. హార్ట్ పేషెంట్లు దీన్ని ఎలాంటి
అనుమానం లేకుండా స్వీకరించవచ్చు. ముఖ్యంగా రోగ నిరోధక శక్తిని
పెంపొందిస్తుంది.
ఇందులో ఉండే బీటా కెరోటిన్ వ్యాధి నిరోధక
శక్తిని ఇనుమడింపజేస్తుంది. క్రమం తప్పకుండా బొప్పాయిని తీసుకుంటే కంటి
చూపు మెరుగవుతుందట. ప్రధానంగా స్త్రీలలో బహిష్టు సమయంలో కనిపించే నొప్పుల
నుంచి బొప్పాయిలో ఉండే పాపైన్ అనే ఎంజైమ్ ఉపశమనం కలిగిస్తుందని ఆరోగ్య
నిపుణులు అంటున్నారు.
0 comments:
Post a Comment