CSS Drop Down Menu

Monday, October 13, 2014

"షుగర్ పేషంట్స్" లో "కాళ్ళ వాపులు" నివారించే చిట్కాలు!!!



మధుమేహంతో బాధపడుతున్న రోగులు ఎక్కువగా పాదాలలో మరియు కాళ్లలో వాపును ఎదుర్కొంటున్నట్లుగా ఫిర్యాదు చేస్తుంటారు. ఈ సమస్యకు ప్రధాన కారణం, ఒత్తిడి ఫలితంగా పాడైపోయిన రక్త కేశనాళికల అసమాన రక్త ప్రసరణ. పాడైపోయిన కేశనాళికలకు కారణం పెరిఫెరల్ ఎడేమా, అంటే పరిసర కణజాలంలోకి ద్రవాల లీకేజ్ వాపులకు కారణమవుతున్నది. కానీ, పాదాల వాపులకు కారణం అనేక ఇతర కారణాలు కూడా ఉన్నాయి. అందువలన సరైన రోగ నిర్ధారణ ముఖ్యం.
 డయాబెటిక్ రోగులలో గాయాలు త్వరగా నయం కాకపోవటానికి కారణం రక్తప్రసరణ సరిగా లేకపోవటం ఒక కారణం. మిస్టర్ భూషణ్ హెమేడ్, డైయాపెడ్,(బహుళ క్రమశిక్షణా పాదాల వైద్యశాలల యొక్క సముదాయము)ఇలా అంటున్నారు 'పాదాల సమస్యలు మధుమేహ రోగులలో సర్వసాధారణం మరియు అవి అతిత్వరగా తీవ్రతరం అవుతాయి.' ఇవి అంటువ్యాధులు మరియు తీవ్రమైన ఇబ్బందుల ప్రమాదానికి గురిచేసే పాదాల పూతలు మరియు గ్యాంగ్గ్రీన్ వంటి వ్యాధులను పెంచుతాయి. అందువలన ఈ పాదాల వాపులను తేలికగా తీసుకోకూడదు. చాలా సందర్భాలలో, ఈ పాదాల వాపులకు ప్రారంభదశలోనే సాధారణ జీవనశైలిలో మార్పులు చేసుకుంటే ఒక గొప్ప సహాయకారిగా ఉంటుంది.
 
క్రమం తప్పకుండా వ్యాయామం:- మిస్టర్ హెమేడ్ 'రెగ్యులర్ వ్యాయామం, పాదాలలో మరియు కాళ్లలో ఎముకల మరియు కీళ్ళ ఆరోగ్యం మెరుగుపడటానికి,కాళ్ళలో రక్త ప్రసరణ మెరుగుపడటానికి మరియు మీ రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉందతానికి సహాయపడుతుంది అని చెపుతున్నారు. కానీ మీరు ముందు ఏ వ్యాయామ కార్యక్రమం ప్రారంభించినా మీ డాక్టర్ ను సంప్రదించండి. కఠినమైన వ్యాయామాలు సాధన చేయవొద్దు, అవి వ్యాయామం ప్రేరిత వాపుకు దారితీస్తాయి.

మీ కాళ్ళు పైకెత్తి పెట్టండి:- ప్రతి రోజు 10-15 నిమిషాలు ఒక మద్దతును లేదా ఒక దిండు ఉపయోగించి (గుండె మట్టానికి) అడుగుల ఎత్తులో ఉంచటం వలన వాపు తగ్గటానికి సహాయపడుతుంది. ఎత్తులో పాదాలు ఉంచతంవలన పరిసర కణజాలం నుంచి వొచ్చే అధిక ద్రవాన్ని అరికట్టబడుతుంది మరియు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది.

 మేజోళ్ళు మరియు పట్టీలు ఉపయోగించండి:- ఇప్పుడు మధుమేహం పాదాల రక్షణ కోసం సంపీడన ఉత్పత్తులు అనేకం అందుబాటులో ఉన్నాయి. అవి ప్రభావిత ప్రాంతం మీద ఒత్తిడి ఏర్పరచి మరియు ద్రవం నిలుపుదల చేయటానికి సహాయపడుతుంది. పెరిగిన బాహ్య ఒత్తిడి ద్వారా ద్రవం తిరిగి శోషరస వ్యవస్థలో చేరటానికి కారణమవుతుంది మరియు రక్త ప్రసరణ కూడా మెరుగుపరుస్తుంది. Wu SC మరియు సహచరులు మధుమేహం రోగులు తేలికపాటి కంప్రెషన్ సాక్స్ ఉపయోగించడం ద్వారా వాస్క్యులారిటి వాడకుండా పిక్కలలో మరియు పాదాల వాపు గణనీయంగా తగ్గించవొచ్చు అని అధ్యయనం ద్వారా తెలిపారు.

ఉప్పు తీసుకోవడం తగ్గించండి:- ఆహార మార్పులు వాపులను తగ్గించడంలో చాలా సహాయపడతాయి. మధుమేహం ఉన్నవారు సాధారణంగా తక్కువ ఉప్పు తినాలి మరియు ఉప్పు ఎక్కువగా తీసుకోవటం వలన రక్తపోటు ఎక్కువ అయి పాదాల వాపు ఎక్కువ అవుతుంది మరియు సోడియం సహజంగా తక్కువగా ఉన్న ఆహారాలు తినాలి.

సౌకర్యవంతమైన బూట్లు వాడండి:- మధుమేహంతో బాధ పడుతున్నవారు బిగుతుగా ఉన్న బూట్లు వాడకూడదు. వీరు కావలసిన పరిమాణం కన్నా ఒక పరిమాణం ఎక్కువ ఉన్న బూట్లు కొనుగోలు చేయటం ఉత్తమం, మీ పాదాల వాపులు ప్రారంభమైనా రక్తప్రసరణ పూర్తిగా తగ్గదు. మధుమేహం కలిగి ఉన్న మహిళలు ఎత్తుమడిమల జోళ్ళు వాడకూడదు. మిస్టర్ భూషణ్ పాదనిపుణుడిని సంప్రదించి మధుమేహం ఉన్న వ్యక్తులు సరిఅయిన పరిమాణం తెలుసుకొని బూట్లు కొనుగోలు చేయమని చెపుతున్నారు.

మీ పాదాలకు మసాజ్ చేయండి:- మసాజ్ వలన మొత్తం పాదంలో రక్త ప్రసరణ మెరుగుపడుతుంది మరియు వాపుకు సంబందించిన నొప్పి కూడా తగ్గుతుంది.

మీ భంగిమ గురించి జాగ్రత్తగా ఉండండి:- సుదీర్ఘ కాలం కూర్చుని ఉండటం లేదా నించుని ఉండటం చేయవద్దు. ఎందుకంటే తగ్గిన రక్త ప్రసరణ తగ్గి తిమ్మిరికి కారణమవుతుంది. మీ కాళ్ళను ఒకదానిమీద ఒకటి ఉంచటం వలన మీ అంత్య భాగాల రక్త ప్రసరణమీద ప్రభావితం అవుతుంది.











0 comments:

Post a Comment