సంపూ సామాన్యుడిలా కనబడట్లేదు. హృదయకాలేయం
అంటూ అందరినీ ఒక్కసారి ఓ తిప్పుతిప్పిన హీరో సంపూర్ణేష్ బాబు తాజాగా మరో
వార్తతో హల్ చల్ చేస్తున్నాడు. మంచు మనోజ్ హీరోగా తెరకెక్కిన కరెంటు తీగలో
పోర్న్ స్టార్ సన్నీ లియోన్ భర్తగా సంపూ నటిస్తున్నట్లు టాలీవుడ్ లో
చెప్పుకుంటున్నారు. హృదయకాలేయంతో సిల్వర్ స్క్రీన్ పై మంచి మార్కులు
కొట్టేసిన సంపూ ఈ చిత్రంలో సన్నీ పక్కన నటించడం ద్వారా ఏ రేంజ్ కు
వెళతాడోనని అనుకుంటున్నారు.
కాగా కరెంటు తీగలో నటిస్తున్నందుకు సన్నీ
ఏకంగా 75 లక్షల రూపాయలు తీసుకున్నదంటున్నారు. మరి సంపూర్ణేష్ ఎంత
అందుకున్నాడన్నది చెప్పలేదు కానీ సన్నీ పక్కన నటిస్తున్నది నిజమే అయితే
మనోడు ఎక్కడికో వెళ్లిపోతాడంటున్నారు. ఇకపోతే ఈ కరెంటు తీగను అక్టోబరు నెల
31న విడుదల చేయడానికి చిత్ర నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.
0 comments:
Post a Comment