CSS Drop Down Menu

Wednesday, October 1, 2014

"ఆహారం" తిన్న వెంటనే "నీళ్ళు" తాగొచ్చా?


 


ఆహారం తీసుకున్న వెంటనే కొందరు ఫుల్‌గా నీరు తాగేస్తుంటారు. అయితే ఆహారం తీసుకున్న తర్వాత పరిమితంగానే నీరు తాగాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఆహారం తీసుకోవడానికి, నీరు తాగడానికి మధ్య కనీసం అరగంటైనా గ్యాప్ ఉండాలి.

ఆహారం తినటానికి కనీసం 40 నిమిషాల ముందు మాత్రమే నీటిని త్రాగాలి. ఆహారం తిన్న తర్వాత నోరు మరియు గొంతును శుభ్రం చేసుకోవటానికి వెచ్చని నీటిని రెండు లేదా మూడు సిప్స్ తీసుకోవచ్చు.

నిజంగా దాహం ఉంటే కనుక, ఉదయం భోజనం తర్వాత సీజనల్ పండ్ల తాజా రసం మరియు లంచ్ తర్వాత మజ్జిగ తీసుకోవచ్చు. రాత్రి భోజనం తర్వాత పాలను తీసుకోవచ్చు. వీటిలో కూడా ఎక్కువగా నీరు కలిగి ఉన్నప్పటికీ, లక్షణాలు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. అవి దెబ్బ తీయటానికి బదులుగా జీర్ణక్రియల కోసం శరీరానికి సహాయం చేస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

0 comments:

Post a Comment