CSS Drop Down Menu

Thursday, October 16, 2014

కామాంధుడికి ప్రజలు వేసిన శిక్ష ?

 దేశంలో కామాంధులు పెచ్చరిల్లిపోతున్నారు. ఆడబిడ్డలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. చట్టాలకు ఏమాత్రం భయపడక తమ పని తాము చేసుకుపోతున్నారు. అందుకే ప్రజలే కామాంధులకు బుద్ధి చెప్పాలని డిసైడ్ అయిపోతున్నారు. ఈ క్రమంలో రాజస్థాన్‌లో ఓ కామాంధుడిపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫలితంగా అతడు పురుషాంగాన్ని కోల్పోయాడు.
 
గంగానగర్లో అక్టోబర్ 10న సురేశ్ కుమార్ అనే ఈ వ్యక్తి ఓ టీనేజ్ బాలికపై అత్యాచారానికి యత్నించాడు. బాలిక అరుపులు విన్న స్థానికులు ఈ కీచకుడిని పట్టుకున్నారు. అయితే, అతడిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్ళకుండా ఓ మటన్ షాపుకు తీసుకెళ్ళారు. అక్కడ మాంసం నరికే కత్తితో అతడి పురుషాంగాన్ని కోసి, దాన్ని రోడ్డుపై విసిరేశారు.
 
అతనిని కాపాడేందుకు ఎవరూ ముందుకు రాలేదు. తగిన శాస్తి జరిగిందని మిన్నకుండిపోయారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. సురేశ్ కుమార్‌పై దాడి చేసిన వ్యక్తులు, తాము అరెస్టు చేయకముందే, స్వచ్ఛందంగా లొంగిపోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. మరి ప్రజలేం చేస్తారో వేచి చూడాలి.

0 comments:

Post a Comment