CSS Drop Down Menu

Saturday, October 25, 2014

అఖిల్‌ను "తిట్టిన" నాగ చైతన్య?

 

తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్న "మన్మథుడు" యువసామ్రాట్ నాగార్జున. ఈయన తనయులు అక్కినేని నాగ చైతన్య, అక్కినేని అఖిల్‌. వీరిలో నాగ చైతన్య ఇప్పటికే హీరోగా స్థిరపడ్డారు. అఖిల్ త్వరలోనే వెండితెరకు హీరోగా పరిచయం కాబోతున్నాడు. 
 
నాగ చైతన్య సినిమాల్లోకి రాకముందు.. రాకముందు కార్లు, బైక్స్ అంటే చాలా ఇష్టమట. తన దగ్గర ఉన్న కారుని, బైకులను చాలా జాగ్రత్తగా చూసుకునేవాడట. ఓసారి చైతు ఇంట్లో లేని సమయంలో అఖిల్ చైతు కారు తీసుకుని ఫ్రెండ్స్‌తో కలిసి జాయ్ రైడింగ్‌కు వెళ్లాడట. 
 
ఆ విషయం వెంటనే చైతన్యకి తెలిసిపోయిందట. ఇంకేముంది.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే అఖిల్‌కి కాల్ చేసి నా కారు, బైక్ ముట్టుకోడానికి వీల్లేదంటూ గట్టిగానే చైతు తిట్టాడట. ఈ విషయాన్ని అఖిల్ ఇటీవల చైతుకి ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేశాడు. ఆ విషయాన్ని తానింకా మరచిపోలేకపోతున్నట్టు చెప్పుకొచ్చాడు.

0 comments:

Post a Comment