CSS Drop Down Menu

Thursday, October 20, 2016

"ఆవు నెయ్యి"తో బోల్డన్ని ఉపయోగాలు !

హిందువులకు ఎంతో పవిత్రమైనది గోమాత. ఆవులో అనేకమంది దేవతలు కొలువున్నారని గోమాతను పూజిస్తారు. ఆవు పాలు, పెరుగు, నెయ్యి, మూత్రం, మలములో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఆవు నెయ్యిని క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకోవడం ద్వారా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. పడుకోబోయే ముందు వేడి పాలలో ఓ చెంచాడు ఆవు నెయ్యి వేసుకుని తాగితే జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. ఉదయానికి విరోచనం సాఫీగా అవుతుంది. 

రోజుకు ఓ స్పూన్ ఆవు నెయ్యి భోజనంలో తీసుకుంటే చిన్న పిల్లల మెదడు ఎదుగుదలకు బాగా ఉపయోగపడుతుంది. ఆవు నెయ్యి కేన్సర్ వ్యాధిగ్రస్తులకు బాగా ఉపయోగ పడుతుంది. కేన్సర్ కణాలను పెరగకుండా చేస్తుంది. సంగీత సాధకులకు గాత్రం మెరుగుపడుతుంది. రోజూ ఆవు నెయ్యి తీసుకుంటే సంభోగ శక్తి, వీర్య కణాల వృద్ధి కలుగుతుంది. ఆకలి కలిగిస్తుంది. చర్మం కాంతివంతంగా ఉంటుంది, కంటిచూపు ను కాపాడుతుంది.

థైరాయిడ్ సమస్యలు ఉన్నవారు ఆవు నెయ్యి తీసుకుంటుంటే సమస్య త్వరగా తగ్గుతుంది. ఆవు నెయ్యి తక్కువ తీసుకుంటే అనవసర కొవ్వు కరుగుతుంది. అదే రోజుకు రెండు చెంచాల కంటే ఎక్కువ తీసుకుంటే లావు అవుతారు. గుండె జబ్బులకు మంచి ఔషధం. మలలు, ఫిస్టులాలు ఉన్నపుడు వాటి పైన ఆవు నెయ్యి రాస్తే నెప్పుల నుంచి మంట నుంచి ఉపశమనం కలుగుతుంది. స్త్రీ స్థనాలు చిన్నవిగా ఉంటే అవి పెరుగుదలకు ఆవు పాలు, నెయ్యి తీసుకుంటే వక్షోజాలు పెరుగుతాయి. చెవి పోటు వస్తే ముక్కులో ఓ రెండు చుక్కలు ఆవు నెయ్యి వేస్తే చెవి పోటు తగ్గుతుంది. ముక్కులో కి వెళ్ళిన ఆవు నెయ్యి కర్ణభేరికి వెళ్ళే నాడులపై పని చేస్తుంది. ఆవు నెయ్యిని పరిమితం గానే తీసుకోవాలి లేకుంటే లావు పెరిగే అవకాశం ఉన్నది.

0 comments:

Post a Comment