CSS Drop Down Menu

Monday, October 6, 2014

"పెరుగు" తీసుకోండి! "ఆయుష్షు"ను పెంచుకోండి !!



 
 ప్రతిరోజూ పెరుగు తింటే ఆయుర్దాయం పెరుగుతుంది. పులియ బెట్టిన పాల ఉత్పత్తులు ఏవి తిన్నా ఆయుష్షు పెరుగుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు. పాలకు బ్యాక్టీరియాను కలిపినపుడు అవి పాలను పెరుగుగా మార్చుతుంది. దానిని మన పరిభాషలో తోడుకోవడమంటాం. పాలలోని లాక్టోజ్ లాక్సిక్ ఆమ్లంగా ఏర్పడటం వల్ల పెరుగుకు ప్రత్యేక వాసన, రుచి వస్తుంది.

జీర్ణనాళానికి మేలు చేసే బ్యాక్టీరియాల సంఖ్య అవసరం. అయితే మేలుచేసే బ్యాక్టీరియా పెరగాలంటే కీడు చేసే బ్యాక్టీరియా సంఖ్యను తగ్గించాలి. మేలే చేసే బ్యాక్టీరియా రోగ నిరోధక వ్యవస్థను బలపరుస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. కాబట్టి పెరుగును రోజూ తీసుకోవడం ద్వారా ఎక్కువ కాలం జీవించగలుగుతారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 

0 comments:

Post a Comment