నేడు ఎక్కడ చూసినా కల్తీ ప్రపంచం నడుస్తోంది. మనం తినే, తాగే ప్రతి పదార్థం కూడా కల్తీ అవుతోంది. నేడు ప్రస్తుతం కల్తీ అవుతున్న పదార్థాల్లో చెప్పుకోదగినవి అనేకమే ఉన్నాయి. అయితే వాటిలో ముఖ్యమైనది తేనె కూడా ఒకటి.
తేనెను తీసుకోవడం వల్ల మనకు ఎలాంటి ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయో
అందరికీ తెలిసిందే. ఎన్నో రకాల విటమిన్లు, మినరల్స్, పోషకాలకు తేనె
నిలయం. పలు అనారోగ్యాలను తగ్గించడంలో, శరీరానికి శక్తినివ్వడంలో
తేనెకు అధిక ప్రాధన్యత ఉంది. ఆయుర్వేదంలోనూ తేనెను పలు ఔషధాలతోపాటుగా
ఇస్తారు. అయితే ప్రస్తుత తరుణంలో తేనె వాడకం ఎక్కువవడంతో వ్యాపారులు
దాన్ని కూడా కల్తీ చేసి మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. ఈ క్రమంలో
జనాలకు అసలు తేనె ఏదో, నకిలీ తేనె ఏదో గుర్తించడం కష్టతరమైంది.
అయితే కింద ఇచ్చిన కొన్ని సూచనలు పాటిస్తే నకిలీ తేనె ఏదో ఇట్టే
తెలుసుకోవచ్చు. మరి ఆ సూచనలు ఏమిటో ఇప్పుడు చూద్దామా!
మీరు కొన్న తేనె అసలుదో, నకిలీదో గుర్తించాలంటే దాన్ని ఒక టేబుల్ స్పూన్
మోతాదులో తీసుకుని ఒక గ్లాస్ నీటిలో వేయాలి. నకిలీ తేనె అయితే వెంటనే
నీటిలో కరుగుతుంది. అసలు తేనె గ్లాస్ అడుగు భాగంలోకి చేరుతుంది. అంతే
తప్ప నీటిలో అంత త్వరగా కరగదు.
ఒక కాటన్ బాల్‌ను తీసుకుని దాన్ని తేనెలో ముంచాలి. అనంతరం దానికి
అగ్గిపుల్లతో నిప్పు పెట్టాలి. అసలు తేనె అయితే కాటన్ బాల్ మండుతుంది.
నకిలీ తేనె అయితే కాటన్ బాల్ మండదు.
ఓ తేనె చుక్కను గోరుపై వేసుకోవాలి. ఆ చుక్క గోరుపై అటు ఇటు కదిలితే అది
నకిలీ తేనె అన్నమాట. అదే ఆ చుక్క కదలకుండా స్థిరంగా ఉంటే ఆ తేనెను
అసలైందిగా భావించాలి.
తెలుసుకున్నారుగా! నకిలీ తేనెను ఎలా గుర్తించాలో. ఇకముందు మీరు తేనె
కొన్నప్పుడు ఇలా ప్రయోగం చేసి చూడడం మరిచిపోకండి. ఎందుకంటే నకిలీ తేనె
అయితే దాంట్లో కలిపే కెమికల్స్ వల్ల మన ఆరోగ్యానికి హాని కలుగుతుంది.
ఎంతైనా మన ఆరోగ్యమే మనకు ముఖ్యం కదా!
అరవై అయిదేళ్ళ నాటి మాట నా చిన్నతనం లో ఇంటికి తేనే పట్టు తో సహా అమ్మకానికి తెచ్చిన తేనెతో ఓ గుడ్డ తడిపి మంటలో కాలచ జూసే వారు. అది నాణ్యతా పరీక్ష.
ReplyDelete