CSS Drop Down Menu

Saturday, July 9, 2016

"మనిషి"ని పోలిన పండ్లను ఎప్పుడైనా చూశారా..?

ప్రకృతిలో అనేక వింతలు దాగున్నాయని మన పెద్దలు అంటూ ఉంటారు. మనిషి సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందినా..ఎన్ని విషయాలు కనుగొన్నా..ఇంకా అంతుచిక్కని ప్రశ్నలు చాలా ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటి నారిఫోన్ పండ్లు. మామూలుగా పండ్లు ఏ ఆకారంలో ఉంటాయి. రౌండ్‌గా ఉండటమో లేదంటే నిలువుగా ఉండటమో జరుగుతుంది. కానీ అచ్చం మనిషిని పోలినట్టు ఉంటే పండ్లును ఎప్పుడైనా చూశారా..? కనీసం ఆ మాటైనా విన్నారా..? కానీ అలాంటి పండు ఒకటి ఉంది. దానిని చూడాలనుకుంటే థాయ్‌లాండ్ వెళ్లాల్సిందే. 


 యువతి రూపంలో ఉండే ఈ అరుదైన ఫలాలను బియర్ గ్రీన్ ఫ్రూట్ అంటారు. వీటికి బౌద్ధపురాణాల ప్రకారం వీటిని నారిఫోన్ ఫలాలుగా పిలుస్తారు. పూర్వం బౌద్దుల దేవుడైన ఇంద్ర..ఆయన సతీమణి వెస్సంతర..ఇద్దరు పిల్లలో కలిసి హిమఫోన్ అడవుల్లో ఉండేవారట. ఓ రోజు వెస్సంతర తినడానికి కావాల్సిన ఆహారాన్ని తెచ్చేందుకు అడవిలోకి వెళ్లింది. ఆ సమయంలో ఆమెను చూసిన కొందరు రుషులు ఆమెపై వ్యామోహంతో వెంబడించారట. అది గమనించిన ఇంద్ర..వాళ్ల దృష్టిని మరల్చడానికి వెస్సంతరను పోలినట్టుగా ఉండే ఫలాలు గల 12 నారిఫోన్ వృక్షాలను సృష్టించాడు. ఆ పండ్లను చూసి ఆకర్షితులైన మనులు వాటిని తింటూ వెస్సంతర‌ను మరచిపోయారట. అలా ఆ ఫలాలను తిన్న మునులు నాలుగు నెలల పాటు నిద్రలోనే ఉండిపోయారట. తర్వాత వాళ్లు నిద్ర లేచేసరికి వారికున్న మహిమాన్విత శక్తులన్నీ కోల్పోయినట్లు చెబుతున్నారు.


 ఇంద్ర..వెస్సంతర మరణించాక ఆ అడవి..నారిఫోన్ వృక్షాలు మాయమైపోయాయట. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత కనిపిస్తున్నాయని అంటున్నారు. అలాగే బ్యాంకాక్‌ సమీపంలోని సింగ్‌బురి బౌద్థ ఆలయం ఆవరణలోనూ ఇలాంటి చెట్లు ఉన్నాయట. అయితే వీటిని నమ్మేవాళ్ళతో పాటు ఇలాంటి పండ్లు లేవని కొట్టిపారేసేవాళ్లు ఉన్నారు. వీటిని కల్పితాలని..ఇలాంటివి అసలు భూమ్మీద లేవని...గ్రాఫిక్స్ అని వాదించేవాళ్లు కోకొల్లలు. ఈ విషయం తెలుసుకున్న శాస్త్రవేత్తలు నిజాలు నిగ్గు తేల్చేందుకు రెడీ అయ్యారు.

0 comments:

Post a Comment