CSS Drop Down Menu

Thursday, July 21, 2016

"కూల్ డ్రింక్స్" కన్నా" ఫ్రూట్ డ్రింక్స్" ప్రమాదకరం !

కూల్ డ్రింక్స్ తాగడం తగ్గించిన వాళ్లు, కార్బోనేటెడ్ వాటర్ తాగలేని వాళ్ళు ఎక్కువగా తాగేది ఫ్రూట్ పేరుతో తయారుచేసిన పానీయాలు. అందులో మాజా, పల్పీ ఆరెంజ్, స్లైస్, యాపీ, నింబు వంటి ఫ్లేవర్లు చాలా పాపులర్. చాలామంది కూల్ డ్రింక్స్ తాగనివాళ్లు కూడా వీటిని ఫ్రూట్ కంటెంట్‌గా భావించి తాగుతుంటారు. వాస్తవానికి మామూలు కూల్‌డ్రింక్స్‌కి, వీటికి తేడా ఉండ‌దు. చక్కెర నీళ్లకు ఫ్రూట్ కాన్సన్‌ట్రేషన్, ఫ్లేవర్ కలుపుతారు. ఫ్రూటీ, మాజా, పల్పీ ఆరెంజ్, ట్రాపికానా, రియల్ ఫ్రూట్ జ్యూస్ ఇలా మార్కెట్లో ఉన్న చాలా బ్రాండ్స్ పరిస్థితి ఇదే. వాటిల్లో ఫ్రూట్ కంటెంట్ 20 శాతం కంటే తక్కువ. వాటికీ, మిగిలిన కూల్ డ్రింక్స్‌కీ ఏమాత్రం తేడా లేదు. 
 
పల్పీ ఆరెంజ్‌లో 11.8 శాతం ఆరెంజ్, మాజా: 19.5 శాతం మామిడి, యాపీ ఫిజ్: 1.9 శాతం యాపిల్ పల్ప్ కాదు. కాన్సన్‌ట్రేటెడ్ యాపిల్ జ్యూస్. యాపిలో 160 ఎంఎల్‌లో 21 గ్రాములు షుగర్ ఉంటుంది. మినిట్ మేడ్ నింబులో నిమ్మకాయ ఫ్లేవర్ మాత్రమే ఉంటుంది. అసలైన నిమ్మకాయ ప్రసక్తే లేదు. ప్రతీ వంద ఎంఎల్‌కీ 11.7 శాతం షుగర్ ఉంటుంది. డైట్ కోక్‌లో షుగర్ వాడరు అనుకుంటాం. కానీ తీపి రావడం కోసం కృత్రిమ రసాయనాలతో తయారైన స్వీటనర్ వాడతారు. రియల్ ఫ్రూట్ జ్యూస్‌లో దానిమ్మ 35 శాతం, ట్రాపికానా యాపిల్‌లో 44 శాతం యాపిల్ ఉంటాయి.
 
ఒక్క మాటలో చెప్పాలంటే వీటిని ఫ్రూట్ డ్రింక్స్ అనకూడదు. స్వీట్ బేవరేజెస్ విత్ ఫ్రూట్ ఫ్లేవర్ అనాలి. మామూలు డ్రింకుల కంటే ఇవి ఎక్కువ ఎందుకు ప్రమాదం అంటే, నిల్వ ఉంచడం కోసం దారుణమైన ప్రిజర్వేటివ్స్ వాడుతారు. రియల్, ట్రాపికానా వంటి వాటిల్లో ఫ్రూట్ శాతం ఎక్కువయ్యే కొద్దీ ప్రిజర్వేటివ్స్ శాతం కూడా చాలా ఎక్కువ అవుతుంది. మామూలు కార్బోనేటెడ్ డ్రింకులు, అంటే థమ్సప్, పెప్సీ, కోక్ వంటివి కాస్త ఎక్కువకాలం కూడా నిల్వ ఉంటాయి. అవి ఎక్కువ రోజులు నిల్వ అయిపోయినా, పెద్దగా తెలీదు. కానీ ఫ్రూట్ జ్యూస్ కాన్సన్‌ట్రేషన్‌తో తయారైనవి అలా కాదు. కోలా డ్రింకుల్లో కంటే వీటిల్లో ఎక్కువ రసాయనాలు ఉంటాయి. 
 
ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి, చక్కెర నీళ్లు పాడైపోకుండా ఉండటానికి వీటిల్లో ప్రిజర్వేటివ్స్ బాగా కలుపుతారు. కృత్రిమంగా ఆయా పండ్ల రుచి తెప్పించడం కోసం రసాయనాలు వాడతారు. ఫ్రూట్ పేరిట అమ్మే డ్రింక్స్‌లో బెన్‌జోయిక్ యాసిడ్ వాడుతారు. కొన్నిటిలో సోడియమ్ బెన్‌జోయేట్, కాల్షియం నైట్రేట్, మెగ్నీషియం క్లోరైడ్ కూటా ఉంటుంది. ఇవి కిడ్నీలను దారుణంగా దెబ్బతీస్తాయి. గుండె జబ్బులకైనా చికిత్స ఉంది కానీ, కిడ్నీలు పాడైతే మాత్రం చేయగలిగింది ఏమీ లేదు. ఇవి కాకుండా ఆయా ఫ్రూట్ జ్యూస్ ఉండే రంగు రావడం కోసం సింథటిక్ ఫుడ్ కలర్స్, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ కలపడం మామూలే.
 
ఇక చక్కెర సంగతి చెప్పక్కర్లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం ఒక మనిషి ఒక రోజుకి 25 గ్రాముల చక్కెర తింటే సరిపోతుంది. ఈ లెక్కన మీరు ఎంత షుగర్ తీసుకుంటున్నారో కాలిక్యులేట్ చేయండి. ఎందుకంటే ఏ ఫ్రూట్ బేవరేజ్ అయినా పేరుకే ఫ్రూట్ డ్రింక్ కానీ, వాస్తవానికి షుగర్ డ్రింక్ అనే చెప్పాలి. ఏ డ్రింక్ అయినా 5 శాతం షుగర్ దాటితే ప్రమాదం. కానీ మనం తాగేవన్నీ 7 శాతం కంటే ఎక్కువ షుగర్ ఉన్నవే. అంతెందుకు మాజా/స్లైస్ వంటి డ్రింకును నాలుగు-ఐదు రోజులు కదపకుండా ఉంచేయండి. బాటిల్ కింద భాగంలో నిల్వ పదార్థాలు తెట్టు కట్టి కనిపిస్తాయి.

0 comments:

Post a Comment