CSS Drop Down Menu

Monday, July 18, 2016

ఆ "జంట చేసిన పనికి" అందరూ అభినిందాల్సిందే !

పెళ్లంటే….భారీ కట్నకానుకలు, విందుభోజనాలు,హంగులు ఆర్బాటాలు. ఇక సంపన్నుల పెళ్ళి గురించైతే ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.వారు భోజనం మీద చేసే ఖర్చు, స్టేజ్ డెకరేషన్ కు చేసే ఖర్చు…ఓ కుటుంబానికి పది నుండి పదిహేను సంవత్సరాలకు సరిపోతుంది. అయితే ఈ జంట మాత్రం తమ  పెళ్లిని అందరికీ కనువిప్పు కలిగించేలా చేసుకున్నారు. ఇండియన్ సివిల్ సర్వీస్ కు ఎంపికైన అభర్, IDBI బ్యాంక్  మేనేజర్ గా పనిచేస్తున్న ప్రీతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రభుత్వ ఉద్యోగ సాధన కోసం… వీరిద్దరూ ఓ కోచింగ్ సెంటర్ లో కోచింగ్ తీసుకుంటున్న సమయంలో ఒకరిపై ఒకరు ఇష్టం పెంచుకున్నారు. ఆ ఇష్టమే క్రమంగా పెళ్లికి దారితీసింది.


అయితే….తమ వివాహాన్ని హంగు ఆర్భాటం లేకుండా సాదాసీదా గా చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు. తమ పెళ్లికి ఖర్చు అయ్యే డబ్బును ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఇవ్వాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా…ఓ 10 రైతు కుంటుంబాలను గుర్తించి…ఒక్కో రైతు కుటుంబానికి 20 వేల చొప్పున మొత్తం 2 లక్షల రూపాయలను అందించారు. అంతే కాకుండా…చదువు విలువ తెలిసిన వారు కాబట్టి…52 విలువైన కాంపిటేటివ్ బుక్స్ ను కొనుగోలు చేసి నాగ్ పూర్ లోని….వివిధ లైబ్రరీలకు ఉచితంగా అందించారు.

పెళ్లికి వచ్చిన అతిథులకు సింపుల్ గా చపాతీ, వెజ్ కర్రీ పెట్టి పంపించారు. హంగు ఆర్భాటాలకు కాకుండా….ఆత్మహత్య చేసుకున్న రైతు కుంటుంబాలకు  వీరు చేసిన కార్యక్రమాన్ని అందరూ అభినందిస్తున్నారు.

0 comments:

Post a Comment