CSS Drop Down Menu

Saturday, August 6, 2016

మనిషి మూత్రంతో "బీర్‌" ?

బీర్ చాలా పాపులర్ అయినటువంటి ఆల్కహాలిక్ బెవరేజ్. బీర్ వల్ల వివిధ రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని చాలా మంది నమ్ముతుంటారు కూడా. ఎందుకంటే బీర్ మన శరీరంలోని టాక్సిన్స్ (విషాలను లేదా వ్యర్థాలను)బయటకు పంపిస్తుంది. అందుకోసమే ప్రపంచ వ్యాప్తంగా బీర్‌కి యమా గిరాకీ పెరిగింది. సాధారణంగా బీర్‌లో ఆల్కాహాల్‌ శాతం తక్కువ ఉండడమే కాకుండా శరీరానికి చల్లదనాన్నిఇవ్వడం, ఆరోగ్యానికి ఎలాంటి హానికరం కాకపోవడం వల్లే బీర్‌ను అత్యధికంగా ప్రజలు సేవిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీర్‌లో ఎన్నో రకాలున్నాయి. 

 
 
జనాల్లో బీరుకున్న క్రేజ్‌ను క్యాష్ చేసుకోవడానికి కొన్ని కంపెనీలు కొత్త ప్రయోగాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా మనిషి మూత్రంతో బీరును తయారుచేయబోతున్నారు. బెల్జియంలోని ఒక ప్రముఖ యూనివర్శిటీలో ఈ ప్రయోగాన్ని చేపట్టింది. ఎలాంటే మనిషి మూత్రంను సోలార్‌ హీటర్‌ ద్వారా శుద్ది చేసి దాని నుండి పొటాషియం, నైట్రోజన్‌, పాస్పరస్‌ను వేరుచేయనున్నారు. ఆ మిగిలిన నీటితో బీర్‌ను తయారు చేస్తున్నారు.
 
మనిషి మూత్రంతో చేస్తున్నఈ  బీర్‌ వల్ల ఆరోగ్యానికి ఎటువంటి హాని కలుగదని ఆరోగ్యానికి చాలా మంచిదని కూడా నిపుణులు అంటున్నారు. మరి వినడానికే వింతగా అనిపిస్తున్న ఈ బీర్‌ మందుబాబుల ఆదరణ పొందుతుందో లేదో వేచిచూడాలి..!

1 comment:

  1. మొరార్జీదేశాయ్ బ్రతికి ఉండుంటే సంతోషించేవాడేమో కదా!

    ReplyDelete