CSS Drop Down Menu

Monday, August 1, 2016

కూల్ డ్రింక్ తాగిన తర్వాత శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో తెలుసా ?

కూల్ డ్రింక్ తాగిన 10 నిమిషాల నుంచి మ‌న శ‌రీరంలో మార్పులు జ‌రుగుతాయి. కూల్ డ్రింక్‌లో 10 చెంచాలకు సరిపడా షుగర్ ఉంటుంది. సాధారణంగా ఇంత మోతాదులో చ‌క్కెర తింటే వాంతులు అవుతాయి. కాని కూల్ డ్రింక్‌లో ఉండేటువంటి ఫాస్ఫోరిక్ యాసిడ్ వాంతులు రాకుండా చేస్తుంది.


కూల్ డ్రింక్ తాగిన 20 నిమిషాలకు డ్రింక్‌లో ఉన్న షుగర్‌ను మన లివర్ రక్తంలోకి పంపిస్తుంది. ఇలా జరగడం వల్ల రక్తంలోని షుగర్ లెవెల్స్ అమాంతంగా పెరిగిపోతాయి. దీని ద్వారా ఈ షుగర్ కొవ్వుగా మారి బరువు పెరుగుతారు. 

కూల్ డ్రింక్ తాగిన 40 నిమిషాలకు రక్తంలోకి షుగర్‌ను పంపించడం కొనసాగుతుంది. కూల్ డ్రింక్‌లో ఉండే కెఫిన్ మెల్లమెల్లగా శరీరంలో నిండుతుంది. దీనితో రక్తపోటు పెరిగి, కంటి పాపలు చిన్నగా అవుతాయి. కెఫిన్ పెద్దవారికి ఎక్కువ హాని చెయ్య‌దు, అలా అని ఎక్కువ మోతాదులో దీనిని సేవించినా ప్రమాదమే. అందుకే చిన్నపిల్లలను కూల్ డ్రింకులకు ఎంత దూరం పెడితే అంత మంచిది.



కూల్ డ్రింక్ తాగిన 45 నిమిషాలకు శరీరంలో డోపమైన్ అనే ఓ కెమికల్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది చిన్న మోతాదులో డ్రగ్స్ తీసుకున్నట్టే అవుతుంది.

కూల్ డ్రింక్ తాగిన 60 నిమిషాలకు శరీరంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. కూల్ డ్రింక్‌లో ఉండే ఫాస్ఫోరిక్ యాసిడ్ చిన్న పేగులలో చేరడంతో, అక్కడ ఉండే కాల్షియం, మెగ్నీషియం, జింక్ వంటి వాటికి అడ్డుకట్ట వేస్తుంది. దీనితో తరచుగా మూత్రవిసర్జన జరగ‌డంతోపాటు, డీహైడ్రేషన్, దాహం లాంటివి పెరుగుతాయి.
   
మన శరీరానికి ఇంతలా హాని తలపెట్టే కూల్ డ్రింక్ తాగడం మనకు, మన పిల్లలకు ఏ మాత్రం మంచిది కాదు. వీలైనంత వరకు వీటికి దూరంగా ఉండడమే మంచిది.

0 comments:

Post a Comment