CSS Drop Down Menu

Wednesday, August 10, 2016

ఆగస్టు 11న ఆకాశంలో అద్భుతం !

ఆకాశంలో మరో అద్భుతానికి సమయం ఆసన్నమైంది. ఆగస్టు 11న అర్థరాత్రి నుంచి తెల్లవారుజాము వరకూ ఆకాశంలో అద్భుతాన్ని చూసి ఆనందించవచ్చు. ఎలాగంటారా? అయితే ఈ స్టోరీ చదవండి. మినుగురు పురుగుల వెలుగులా.. గంటకు సుమారు 200 వరకు ఉల్కలు భూవాతావరణానికి ప్రవేశించనున్నాయి. ఈ ఉల్కల ద్వారా ఒక్కసారిగా భారీ వెలుగు వెదజల్లుతాయని నాసా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. 
 
ఈ ఉల్కలు సెకనుకు 59 కిలోమీటర్ల వేగంతో భూవాతావరణంలోకి వచ్చే సమయంలో అడ్డువచ్చే దుమ్ము, ధూళి కణాలను ఢీకొన్నప్పుడు మండిపోయి భారీ వెలుగు వస్తుంది. ఇలాంటి ఉల్కల వెలుగు ఎన్నో సంవత్సరాలకు ఓసారే చూసేందుకు వీలవుతుందని శాస్త్రవేత్త బిల్ కుక్ తెలిపారు. ఈ ఉల్కలు బిలియన్ మైళ్ల పాటు ప్రయాణించి.. ఆపై భూవాతావరణంలోకి వస్తాయని.. ఆ సమయంలో దుమ్ము, ధూళిని ఢీకొని మండితూ వెలుగునిస్తాయని శాస్త్రవెత్తలు చెప్తున్నారు. 

0 comments:

Post a Comment