ప్రతి రంగుకు ఓ గొప్పతనం ఉంది. రంగులు
వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తాయి. మనిషిని సంతోషంలో
ముంచెత్తుతాయి. ఈ రంగులు మనసులోని భావాలను తెలుపుతాయి. చాలా రంగుల్లో
జబ్బులను నయం చేసే గుణం ఉంది. దీనినే కలర్ థెరపీ అంటారు.
ఆదివారం: ఆదివారం
నాడు సూర్యుడిని ప్రార్థిస్తారు. ఈ రోజున గులాబీ రంగు కలిగిన వస్త్రాలను
ధరించాలి. కొన్ని రంగులు మనకు నచ్చుతుంటాయి. అందుకే ఆయా రంగుల పట్ల
ఆకర్షితులమవుతుంటాము. దీనినే ” కలర్ సైన్స్ ” అంటారు. కాని జ్యోతిష్యాన్ని
నమ్మేవారు రోజుననుసరించి రంగు దుస్తులను ధరిస్తున్నారు.
సోమవారం : సోమవారం అంటే చంద్రునికి ప్రతీక, కాబట్టి ఈ రోజున తెల్లటి వస్త్రాలను ధరించండి.
మంగళవారం :
మంగళవారం హనుమంతుని రోజుగా భావిస్తారు. హనుమంతుని విగ్రహాలను కాషాయం
రంగులో చూస్తుంటాం. కాబట్టి మంగళవారంనాడు ప్రత్యేకంగా కాషాయం రంగు కలిగిన
వస్త్రాలను ధరించండి. ఫలితం ఉంటుందంటున్నారు జ్యోతిష్యులు.
బుధవారం : వారంలో
మూడవ రోజు గణాధిపతికి సంబంధించిన రోజు. విఘ్నాలకు అధిపతైన విఘ్నేశ్వరునికి
ఆకుపచ్చ రంగు అంటే చాలా ఇష్టం. కాబట్టి బుధవారం నాడు పచ్చరంగు కలిగిన
వస్త్రాలను ధరించండి.
గురువారం : గురువారాన్ని
బృహస్పతి వారం అని కూడా అంటారు. ఈ రోజున గురువులకు అధిపతైన బృహస్పతి
దేవుడు అలాగే షిరిడీ సాయిబాబాకు మహా ప్రీతి. బృహస్పతి దేవునికి పసుపు
రంగంటే చాలా ఇష్టం. కాబట్టి ఈ రోజున పసుపు రంగు వస్త్రాలను ధరించండి.
శుక్రవారం : శుక్రవారం
దేవీ(అమ్మవారు)కి సంబంధించిన రోజు. అమ్మవారు జగజ్జననీ. ఆమె సర్వాంతర్యామి.
కాబట్టి ఈ రోజున అన్ని రంగుల మిశ్రమమున్న వస్త్రాన్ని ధరించండి.
శనివారం : శని దేవునికి సమర్పించే ఈ రోజున నీలి రంగు కలిగిన వస్త్రాలను ధరించండి.
0 comments:
Post a Comment