మరణం అనే మాట అంటే చావు భయం.
చనిపోతామని తెలిస్తే ఇంకేముంది... అంతా అయిపోయింది అని గుండె చెరువయ్యేలా
ఏడుస్తారు. కానీ ఓ మహిళ ఇందుకు భిన్నంగా ప్రవర్తించింది. తను ఇక ఎన్నో
రోజులు బ్రతకనని తెలుసుకున్న ఆ మహిళ తన చావు బాధాకరంగా ఉండకూడదని, చాలా
సంతోషకరమైన ముగింపు కావాలని కోరుకుంది. దాంతో ఇక ఎంతమాత్రం ఆలస్యం చేయకుండా
తన స్నేహితులందరికీ ఆహ్వానాలు పంపింది.
ఆమె పేరు బెట్సీ డావిస్. 41 ఏళ్ల వయసున్న
ఆమె రంగస్థల నటి, చిత్రకారిణి కూడా. ఆమె ప్రాణాంతక వ్యాధి సోకినట్లు
వైద్యులు గుర్తించారు. మరో 6 నెలలకు మించి బ్రతకవని ఆమెకు స్పష్టం చేశారు....