CSS Drop Down Menu

Thursday, June 5, 2014

"ఉద్యోగస్తులు" ఎదుర్కొనే "అనారోగ్య సమస్యలు"


ప్రస్తుత జీవన శైలి చాలా కష్టంగా మారుతున్నది. ఉరుకుల పరుగుల జీవితంతో చాలా మంది అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పనిచేసే ఉద్యోగస్తులు సరైన ఆహారం, విశ్రాంతి, నిద్ర, లేకపోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి వస్తోంది. ప్రస్తుత కార్పొరేట్ రంగంలో బిజీబిజీ జీవితాలు, టార్గెట్లు, డే అండ్ నైట్ షిఫ్టులు వల్ల వెన్నునొప్పి మొదలకొని, మానసిక, భౌతిక ఆరోగ్యాన్ని దెబ్బతీసే ఒత్తిడి వరకూ అనేక రకాలైన జబ్బుల బారిన పడాల్సి వస్తోంది. మరియు ప్రస్తుత రోజుల్లో పనిచేసే ఉద్యోగస్తువులు ఇటువంటి ఆరోగ్యసమస్యలను లెక్క చేయకుండా వారి అలవాట్లు, అభిరుచుల, ప్రాశ్చ్యాత్య పోకడలతో అనారోగ్యాలకు స్వాగతం పలుకుతున్నారు.
 ఉదాహరణకు, చాలా మంది పనిచేసే ఉద్యోగస్తులు హెల్తీ డైట్ ను పాటించరు.
 దాంతో అనేక రకాల అనారోగ్య సమస్యలను అంటే ఉన్నట్లుండి బరువు పెరగడం, అనీమియా, హార్మోనుల అసమతుల్యత, దాంతో మహిళల్లో రుతుక్రమ సమస్యలు ఇటువంటి మరికొన్ని సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఉద్యోగస్తులకు మరో చెడు అలవాటు సరైన వ్యాయమం లేక పోవడం వల్ల కూడా అనేకఅనారోగ్య సమస్యలు(బాడీపెయిన్స్, రక్తప్రసరణ సరిగా జరగకపోవడం, అలసట, తలనొప్పి )కు దారితీస్తోంది.
 ఎక్కువ సమయం కంప్యూటర్ల ముందు కూర్చునే పనిచేయడం వల్ల అనారోగ్యలక్షణాలు మరిన్ని పెరుగుతాయి. ఎక్కువసమయం కూర్చోవడం వల్ల మెడనొప్పి, వెన్నునొప్పి, కళ్ళ మసకలు బారడం, బాన పొట్ట వంటి లక్షణాలు ఎదుర్కోక తప్పదు.
 ప్రస్తుత జనరేషన్ లో వందకి తొంబైశాతం కంప్యూటర్లు లేదా ల్యాప్ టాప్ లకు అడిక్ట్ అయిపోయుంటారు. క్రమం తప్పకుండా వీటి ముందు కూర్చోవడం వల్ల కంటి ఆరోగ్యం దెబ్బతింటుంది. దాంతో అనేక సమస్యలు ఎదుర్కోవల్సి వస్తుంది. ఇక చాలా మందికి నైట్ షిప్టులు, లేదా లేట్ నైట్ వర్క్ వల్ల కూడా అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుంది. నిద్రలేమి వల్ల కూడా ఆరోగ్యం దెబ్బతిని అనారోగ్య౦పాలు చేస్తుంది. మరి పనిచేసే వారికి సాధారణంగా ఎదురయ్యే అనారోగ్య సమస్యలు ఒక సారి పరిశీలించండి.

ఉద్యోగస్తులు ఎదుర్కొనే అనారోగ్య సమస్యలు-నివారణ!
 మెడనొప్పి:
 కంప్యూటర్ ముందు ఎక్కువ సమయం గడపడం వల్ల మెడ నొప్పి ఎక్కువగా బాధిస్తుంది. అందువల్ల మద్య మద్యలో చిన్న విరామాలు తీసుకోవడం వల్ల కండరాలకు కొంత సడలింపు జరిగి రక్తప్రసరణ జరుగుతుంది.

కళ్ళు మండుట:
 కంప్యూటర్ లేదా ల్యాప్ టాప్ ముందు కూర్చొని ఎక్కువ సమయం స్క్రీన్ వైపు తదేకంగా చూడటం వల్ల కళ్ళు మంటకు దారితీసి, కళ్ళు ఎర్రగా మారుతాయి. కాబట్టి ప్రతి గంటకొకసారి దృష్టిని పక్కకు మరల్చడం చాలా అవసరం. లేదా ఒక రెండు నిముషాలు బ్రేక్ తీసుకోండి. సీట్లోనే వెనకు కూర్చొని కళ్ళను రెండు నిముషాల పాటు మూసుకొని విశ్రాంతి కల్పించండి.

అకలిలేకపోవడం:
 ఉదయం సమయంలేదనో లేదా మీటింగ్స్ వల్లనో మీరు సరైన టైంలో ఆహారం తీసుకోకపోవడం వల్ల ఆకలి తగ్గిపోతుంది. ఇది ఒక అలవాటుగా మారి, తర్వాత ఆరోగ్య సమస్యలు, అజీర్ణం తలెత్తుతుంది.

అజీర్ణం:
 ఒక్కసారిగా ఎక్కువ ఆహారాన్ని తీసుకొన్నప్పుడు తప్పనిసరిగా చిన్న నడక చాలా అవసరం. కొన్ని సందర్భాల్లో మీరు తీసుకొనే పెద్దమొత్తం ఆహారం మిమ్మల్ని మీ సీట్లో నుండి కదలనివ్వదు. అలాగే కూర్చొంటే అజీర్ణంకు దారితీస్తుంది.

బెల్లీ ఫ్యాట్:
 ఆఫీసుల్లో జంక్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల అదనపు బరువు పెరుగుతారు. ఆఫీసుల్లో చాలా మంది ఫ్రైడ్ స్నాక్స్ మరియు ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల అధిక బరువుకు దారితీస్తుంది. మరి బెల్లీ ఫ్యాట్ తగ్గించాలంటే లోక్యాలరీ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవాలి.

తలనొప్పి:
 పని ఒత్తిడి వల్ల వచ్చే సాధారణ అనారోగ్య సమస్య తలనొప్పి. కొంతమందైతే ఏకంగా మైగ్రేన్ తలనొప్పితో బాధపడాల్సి వస్తుంది. ఇది ఒత్తిడి వల్ల ఎక్కువ అవుతుంది.

ఒత్తిడి:
 పనిచేసే వారిలో చాలా ఎక్కువగా సహజంగా కనిపించే ఆరోగ్య సమస్య స్ట్రెస్(ఒత్తిడి). ఒత్తిడి ఎక్కువగా ఉండటం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఎదురౌతాయి. ఒత్తిడి వల్ల ఫిజికల్ గాను, మెంటల్ గాను సమస్యలను ఎదుర్కొంటారు. కాబట్టి సాధ్యమైనంత వరకూ ఒత్తిడి తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి.

నిద్రలేమి:
 లేట్ నైట్ వరకూ పనిచేయడం లేదా సరిగా విశ్రాంతి తీసుకోకపోవడం వల్ల నిద్రలేమి సమస్య ఎదురౌతుంది. పని ముఖ్యమే, కానీ శరీరానికి మరియు మైండ్ కు నిద్రకూడా అంతకంటే ముఖ్యం అని తెలుసుకోవాలి.

బ్యాక్ పెయిన్:
 వెన్నునొప్పి పనిచేసే ఉద్యోగస్తులు అధికంగా బాధించే ఆరోగ్య సమస్యలో ఒకటి. కాబట్టి మీరు కూర్చొనే, భంగిమ, కీబోర్డ్ పొజిషన్ సరిగా చూసుకోవాలి.

వ్యాయం లేకపోవడం:
 చాలా మంది పనిచేసే ఉద్యోగస్తులు ఉదయం లేవడానికి చాలా బద్దకిస్తారు. ఆ బద్దకాన్ని పక్కన పెట్టి రోజుకు అరగంట వ్యాయామం చేయడం చాలా అవసరం. ప్రతి రోజూ వ్యాయామం చేయడం వల్ల అనేక ఆరోగ్యప్రయోజనాలను పొందవచ్చని మీకు తెలిసుండకపోవచ్చు. అంతే కాదు , వ్యాయామం వల్ల శరీరం మొత్త౦ రక్తప్రసరణ వల్ల గుండె మరియు మైండ్ ఆరోగ్యంగా ఉంటుంది. మరియు ఒత్తిడి నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది.

వెన్నెముక నొప్పి:
 స్పాండిలైటిస్, పనికి వెళ్లేటప్పుడు తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు వాహనాలు నడపడం వల్ల వెన్నెముక నొప్పి ఏర్పడుతుందని అనుకుంటారు. కానీ ఎక్కువ సమయం కూర్చోవడం వల్ల కూడా ఈ సమస్య ఎదురౌతుంది.

బాడీ పెయిన్:
 రోజంతా పనిచేయడం వల్ల విపరీతంగా ఒళ్ళు నొప్పులు వస్తాయి. పనిచేసే వారు ఎదుర్కొనే చాలా సాధరణ సమస్య ఇది. కాబట్టి ప్రతి రోజూ గోరువెచ్చని నీటితో స్నానం చేయడం చాలా అవసరం.


0 comments:

Post a Comment