బృహదీశ్వర ఆలయం ఇది శైవాలయం (శివాలయం).బృహదీశ్వర ప్రాచీన హిందూ దేవాలయం. ఇది తమిళనాడు లోని తంజావూరు లో కలదు.
భారతదేశంలోనే అతిపెద్ద దేవాలయంగా పరిగణింపబడుచున్నది.
ఈ దేవాలయం యునెస్కో చే ప్రపంచ వారసత్వ ప్రదేశం గా గుర్తింపబడినది.
దీనిని చోళ రాజు "రాజ రాజ చోళుడు" నిర్మించాడు. ఇది చాల పెద్ద ఆలయం. పదమూడు అంతస్తులున్న ఈ ఆలయ శిఖరం 216 అడుగుల ఎత్తున్నది. పైన 80 టన్నుల బరువున్న నల్లరాతి తో శిఖారాగ్రాన్ని నిర్మించారు. ఇంత బరువున్న ఆ పెద్ద రాయిని అంత ఎత్తుకు ఎలా తీసుకెళ్లారనేది ఎవ్వరికి అర్థం కాని విషయం. ఒక అంచనా ప్రకారం ఇక్కడికి నాలుగు మైళ్ల దూరం నుండి ఏట వాలుగా ఒక రాతి వంతెన కట్టి దాని పైనుండి ఏనుగులతో అతి బరువైన ఆ రాతిని ఈ శిఖరంపైకి తరలించారని తెలుస్తున్నది. రాజ రాజ చోళుడు క్రీ.శ. 985 నుండి 1012 వరకు రాజ్యం చేశాడు. చరిత్రను బట్టి ఈ ఆలయాన్ని రాజు తన 19 వ ఏటనే ప్రారంబింఛాడని తెలుస్తున్నది. గర్బ గుడి లోని శివ లింగం 13 అడుగుల ఏక శిలా నిర్మితం. ఈ ఆలయ ప్రాకారాలు చాల విశాలమైనవి. ప్రాకారం పొడవు 793 అడుగులు కాగా వెడల్పు 393 అడుగులు..ఆలయం ముందున్న పెద్ద నంది విగ్రహం, గర్బ గుడిలోని 13.5 అడుగుల ఎత్తు 60 అడుగులు విస్థీర్ణం లో వున్న శివలింగం, ఆలయానికే ప్రత్యేక ఆకర్షణ.

ఈ దేవాలయం యొక్క ప్రధాన దైవం శివుడు. అన్ని దేవతల విగ్రహాలు కూడా బయటి
గోడలపై ఉన్నవి. వాటిలో దక్షిణామూర్తి, సూర్యుడు, చంద్రుడు విగ్రహాలు
పెద్దవి. ఈ దేవాలయం అష్ట దిక్పాలకుల విగ్రహాలను కలిగిన అరుదైన దేవాలయాలలో
ఒకటి. ఈ విగ్రహాలు ఇంద్రుడు, అగ్ని,యముడు,నిరృతి, వరుణుడు, వాయువు,
కుబేరుడు మరియు ఈశానుడు అనే అష్టదిక్పాదకులు. ఈ విగ్రహాలు జీవిత పరిమానం
గలవి అనగా 6 అడుగుల ఎత్తు కలవి.
0 comments:
Post a Comment