CSS Drop Down Menu

Wednesday, June 18, 2014

"బియ్యం"తో "అందం"





భారతీయులు ఎక్కువగా వారి రోజువారీ భోజనంలో రైస్ కోరుకుంటారు. ప్రత్యేకించి తూర్పున మరియు దక్షిణాన నివసించే ప్రజలు, బియ్యం వారి ప్రధాన ఆహారంగా ఏర్పరచుకున్నారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, బియ్యం కూడా సౌందర్య సంరక్షణ కోసం ఒక అద్భుతమైన పదార్ధంగా ఉపయోగపడుతుంది. ఈ రైస్ అతని / ఆమె చర్మం కాంతివంతంగా చేయటంలో సహాయపడుతుంది మరియు ఆ కాంతి చాలాకాలం ఉంచుతుంది. ప్రతి మహిళ ప్రకాశవంతమైన, సిల్కీ మరియు మృదువైన ఛాయను పొందాలనే కోరిక కలిగి ఉంటుంది. ఆసియా దేశాలలో నివస్తున్న మహిళలు ప్రకాశవంతమైన, మృదువైన మరియు ప్రకాశవంతమైన ఛాయతో ఉంటారు. వారి చర్మం కాంతివంతంగా ఉండటానికి గల కారణాలలో ఒకటి వారి ఆహారపు అలవాటు. మీరు కూడా అందమైన చర్మం కలిగిఉండాలి అనుకుంటే, మీ అందం విస్తరించేందుకు రైస్ వంటకం తినటం ప్రారంభించండి. మీ చర్మం ప్రకాశవంతంగా తయారుకావటానికి మార్గాలు ముడి బియ్యం సరిగ్గా రెండు టేబుల్ స్పూన్స్ తీసుకోండి మరియు వాటిని ఒక కంటైనర్ లో ఉంచండి. బియ్యంలో ఉన్న మురికి మరియు అవసరం లేని రేణువులను కడగండి. శుభ్రంగా కడిగిన బియ్యంలో శుభ్రమైన నీటిని పోయండి మరియు ఒక మూతతో ఆ పాత్రను మూసిఉంచండి. పాత్రలోని బియ్యం అడుగున చేరేవరకు ఇరవై నిముషాల వరకు అలానే ఉంచండి. పాత్రలో పైన తేరుకున్న పాలరంగులో ఉన్న నీటిని తీసి వేరేపాత్రలో పోయండి. ఈ బియ్యం కడుగు నీటితో మీ ముఖాన్ని శుభ్రం చేసుకోండి. మీ ముఖం మీద నీరు ఆరేవరకు అలానే ఉంచండి. ఒకసారి ఆరింది అనుకుంటే, మరల దానిమీదనే మరల కడుగు నీటిని పోసుకోండి. బియ్యం కడుగు నీటిలో ఉన్న విటమిన్లు మరియు ఖనిజాలు మీ చర్మం రంధ్రాల ద్వారా శోషించబడి మీ చర్మం ఎండినట్లుగా ఉంటుంది. మీరు ముఖాన్ని కడిగిన తరువాత మీ చేతితో ముఖాన్ని తాకినట్లయితే, చాలా సున్నితంగా అనిపిస్తుంది. ఇప్పుడు మీరు ప్రకాశవంతంగా మరియు ప్రకాశించే రంగు ఛాయతో మేక్-అప్ వేసుకోవొచ్చు. ప్రజలు ఉపయోగించే బియ్యం ఒకే రకమైనవి కాకపోవొచ్చు. మీ చర్మం అందంగా తయారవటానికి ఏ రకమైన బియ్యానైనా ఉపయోగించవొచ్చు.  మీ ముఖం నిస్తేజంగా మారింది అంటే, మీ చర్మం కాంతివంతంగా తయారుచేసుకోవటానికి సమయం ఆసన్నమైందన్న మాట. మీ చర్మాన్ని కాంతివంతంగా మార్చుకోవటానికి రైస్ ను ఉపయోగించవొచ్చు. మీ చర్మం కాంతివంతంగా మారటానికి హాని కలిగించే ఎటువంటి సౌందర్య సాధనాలను ఉపయోగించనవసరం లేదు. మీరు సులభంగా దొరికే రైస్ మీద ఆధారపడవొచ్చు. మీరు బియ్యం కడుగు నీటిలో దూదిని ముంచి, దానిని ఉపయోగించండి మరియు ప్రకాశవంతమైన చర్మాన్ని పొందండి.

 లాభాలు:- ఈ విధంగా చేయటం వలన మీ చర్మం గట్టిపడుతుంది. మీ చర్మం చాలా మృదువుగా అవుతుంది. మీ చర్మ రంధ్రాలు దగ్గరగా ముడుచుకుంటాయి. మీ చర్మం కాంతివంతంగా తయారవటానికి ఖర్చులేని మార్గం. మీ చర్మచాయ కాంతివంతంగా అవుతుంది. ఇది మీ చర్మానికి తేజస్సును కలిగించే ఒక మూలకం. ఇది ఒక సహజ ఆర్గానిక్ క్లీన్సెర్ లాగా పనిచేస్తుంది. చేతులతో ఈ క్లీన్సెర్ ను ముఖంపై వర్తింపచేసుకున్నందువలన వారి చేతులు కూడా కోమలంగా, నునుపుగా తయారవుతాయి. మీరు నిస్తేజమైన మరియు పొడిబారిన చర్మం కలిగి ఉంటే, ఈ బియ్యం క్లీన్సెర్ను మీరు అద్భుతమైన రంగు ఛాయను తిరిగి పొందడంలో సహాయం చేస్తుంది. చాలా తక్కువ ఖర్చుతో కూడిన ఈ రైస్, ఉపయోగించటం వలన కలిగే చర్మకాంతిని చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. నమ్మలేక పోతున్నారా? అయితే మీరు కూడా వాడి చూడండి .

0 comments:

Post a Comment