గుండెపోటు నివారణకు కూడా వ్యాక్సిన్ వచ్చేసింది. పోలియో, ధనుర్వాతం, హెపటైటిస్ బి లాంటి రాకుండా చిన్నారులు, పెద్దలకు వ్యాక్సిన్లు ఇవ్వడమనేది ఇప్పటివరకు అందరికి తెలిసిన విషయమే. ఇప్పుడు తాజాగా గుండెపోటును నిరోధించే వాక్సిన్‌ను స్వీడన్ శాస్త్రజ్ఞులు తయారుచేశారు. త్వరలో దీన్ని భారతదేశంలో ప్రయోగాత్మకంగా పరీక్షించబోతున్నారు. ఈమేరకు భారతీయ వైద్య సంస్థలతో తుదిచర్చలు జరుపుతున్నట్టు స్టాక్‌హోంలోని కరోలిన్‌స్కా ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన భారతీయ సైంటిస్ట్ బి సంజీవి తెలిపారు. అవి ఫలిస్తే త్వరలోనే భారత్‌లో ఈ వాక్సిన్‌ను పరీక్షించే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
సాధారణంగా గుండెకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాలు గట్టిపడి, కుచించుకుపోయినప్పుడు హృదయానికి రక్తసరఫరా తగ్గి గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్ వంటివి వచ్చే ప్రమాదం ఉంటుంది. రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి, గట్టిపడి ఫలకాలుగా మారడం వల్ల ఏర్పడే ఈ స్థితిని ఎథెరోస్క్లెరోసిస్ అంటారు. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో శరీరంలోని రోగనిరోధక వ్యవస్థ అలా పేరుకుపోయిన కొవ్వుపై దాడి చేస్తుంది. ఇది రక్తనాళాల లైనింగ్‌ను దెబ్బతీసి, వాపు రావడానికి కారణమవుతుంది. తద్వారా క్లాట్‌లు ఏర్పడి హార్ట్ ఎటాక్ వస్తుంది. స్వీడన్ శాస్త్రజ్ఞులు తయారు చేసిన వాక్సిన్.. రోగనిరోధక వ్యవస్థలో ఈ కొవ్వును గుర్తించే గ్రాహకాలను పనిచేయకుండా నిరోధిస్తుంది. తద్వారా గుండెపోటు వచ్చే ముప్పు 70% దాకా తగ్గుతుంది.

0 comments:
Post a Comment