CSS Drop Down Menu

Thursday, June 19, 2014

"మధుమేహగ్రస్తులు తీసుకోవలసిన ఆహారాలు"


డయాబెటిస్‌ వ్యాధికాదు డిజైస్టివ్‌ డిజార్డర్‌. దీన్ని ఇలాగే వదిలేస్తే శరీరంలోని అన్ని అవయవాలు దెబ్బతింటాయి. ప్రపంచ వ్యాప్తంగా  మిలియన్ల మంది డయాబెటిస్‌ వ్యాధితో బాదపడుతున్నారు. మనిషిని పట్టి పీడిస్తున్న వ్యాధులన్నీ ఒకెత్తయితే, డయాబిటీస్ ఒకటీ ఒకెత్తుగా మారిన ప్రస్తుత కాలంలో ఆహార నియంత్రణే ఈ వ్యాధి నివారణకు మార్గంగా వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా కెలోరీలు తక్కువగా ఉండే ఆహార పదార్ధాల జాబితాను సిద్ధం చేసుకోవాల్సిందిగా కూడా ముందుజాగ్రత్తలను సూచిస్తున్నారు.

అటువంటి జాబితా మీరు ప్లాన్ చేసుకోవాంటే మీకోసం కొన్ని ఆహారాలను ప్రత్యేకంగా ఇక్కడ లిస్ట్ తయారుచేయబడింది. ఇటువంటి ఆహారాలు తీసుకోవడం వల్ల నోటి రుచికి మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. కొన్ని రకాలైనటువంటి కూరగాయలు మరియు పండ్లలో ఉండేటటువంటి ప్రోటీనులు మరియు విటమినులు మీ శరీర మరియు మానసిక స్థితిని బలపరుస్తాయి.  ఇవి మీ మధుమేహగ్రస్థులకు శక్తిని మరియు రోగనిరోధక శక్తిని మెరుగుపరు
స్తాయి. మరి అవేంటో ఒక సారి చూద్దాం.

బీన్స్: బీన్స్ లో హై క్యాలరీలు, కిడ్నీబీన్స్, పింటో, నేవీ, బ్లాక్ మరియు ఇతర రకాల బీన్స్ కూడా ఉన్నాయి. వీటన్నింటిలో న్యూట్రీషియన్స్ మరియు ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి. ఈ న్యూట్రీషియన్స్ మరియు ఫైబర్స్ కడుపు ఫుల్ గా ఉండేలా చేసి,ఎక్కువ సమయం ఆకలి కాకుండా చేస్తుంది.

డార్క్ లీఫీ గ్రీన్ వెజిటేబుల్స్: ఆకు కూరలు, కొల్లార్డ్ గ్రీన్, మస్టర్డ్ గ్రీన్స్, కాలే మరియు ఇతర డార్క్ గ్రీన్ లీఫ్ వెజ్జీస్ అధిక న్యూట్రీషయన్స్ కలిగి, తక్కువ కార్బోహైడ్రేట్స్ కలిగి ఉంటాయి. మరియు అతి తక్కువ క్యాలరీలను కలిగి ఉంటాయి.

సిట్రస్స్ పండ్లు: ఆరెంజ్, గ్రేఫ్ ఫ్రూట్స్ మరియు ఇతర సిట్రస్ పండ్లలో అధిక శాతంలో విటమిన్ సి ఉంటుంది. ఇది హార్ట్ హెల్త్ కు చాలా గ్రేట్ గా సహాయపడుతుంది. పండ్లను జ్యూస్ రూపంలో కాకుండా, నేరుగా అలాగే పండ్లను తీసుకోవాలి. కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి. లోక్యాలరీలను కలిగి ఉంటాయి కాబట్టి వాటిని మీరు పూర్తిగా తీసుకోవాల్సి ఉంటుంది.

స్వీట్ పొటాటో: విటమిన్ ఎ మరియు ఫైబర్, లోగ్లైసిమ్ ఇండెక్స్ పుష్కలంగా ఉంటుంది. స్వీట్ పొటాటో మీ బ్లడ్ షుగర్ లెవల్స్ పెంచదు. రెగ్యులర్ పొటాటోకు స్వీట్ పొటాటోకు వ్యత్యాసం ఉన్నది.
బెర్రీస్ : బెర్రీస్ లో అన్ని రకాల బెర్రీస్ ఆరోగ్యానికి మేలు చేసేవే, అయితే వాటిలో స్ట్రాబెర్రీ, బ్లూ బెర్రీస్ మరియు ఇతర బెర్రీస్ లో యాంటీయాక్సిడెంట్స్, విటమిన్స్ మరియు ఫైబర్ ఫుష్కలంగా ఉంటుంది. అయితే వీటి తాజాగా తీసుకొని సలాడ్స్, స్మూతీస్ లేదా సెరల్స్ రూపంలో తీసుకోవాలి.

టమోటో: ఈ లోక్యాలరీ సూపర్ ఫుడ్స్ ను నేరుగా అలాగే పచ్చివి లేదా ఉడికించివి తీసుకోవాలి. ముక్కలుగా కట్ చేసి, ఉడికించి, లేదా ఆవిరి పట్టించి, లేదా సైడ్ డిష్ లా సలాడ్స్, సూప్స్, క్యాసరోల్స్ లేదా ఇతర డిష్ లలో తీసుకోవచ్చు.

చేపలు: సీఫుడ్స్ లో ఒమేగా 3ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి . సాల్మన్, ఆల్బకోర్ తునా, మెకరెలా, హలీబట్ మరియు హెరింగ్ వంటి వాటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఫుష్కలంగా ఉండా ఇవి గుండె ఆరోగ్యానికి మరియు డయాబెటిక్స్ రాకుండా సహాయపడుతుంది.

తృణధాన్యాలు: బార్లీ, ఓట్ మీల్, బ్రౌన్ బ్రెడ్ మరియు ఇతర తృణధాన్యాలలో ఫైబర్ ఫుష్కలంగా ఉంది. వీటిలో మెగ్నీషియం మరియు క్రోమియం ఫొల్లెట్ మరియు ఒమేగా 3ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి.

నట్స్: డైట్ పరంగా ఇందలో హై ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది, అయితే ప్రత్యుత అధ్యయనాలు, పరిశోధనలు వీటిలో ‘మంచి ఫ్యాట్స్' (ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ )ఉన్నట్లు కనుగొన్నారు. ఇది హార్ట్ హెల్త్ ను మెరుగుపరుస్తుంది మరియు ఇతర ప్రయోజనాలను చేకూర్చుతుంది. అయితే నట్స్ లో క్యాలరీలు అధికంగా ఉన్నాయి, అందుకే ఎక్కువగా బాదం మరియు వాల్ నట్స్ వంటివి తీసుకోకూడదు.

ఫ్యాట్ ఫ్రీ మిల్క్ మరియు పెరుగు: ఈ డైరీ ఫుడ్స్ క్యాల్షియం మాత్రం అంధివ్వడం మాత్రమే కాదు, విటమిన్ డి కూడా అంధిస్తుంది. మరియు ఇది ఆకలిని నియంత్రిస్తుంది.
















0 comments:

Post a Comment