CSS Drop Down Menu

Tuesday, August 16, 2016

మన ముఖ్యమంత్రులు తీసుకునే "వేతనాలు" ఎంతో తెలుసా ?

భారత రాష్ట్రపతి కంటే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీసుకునే వేతనాలు అధికం. భారత రాష్ట్రపతికి రూ.1.50 లక్షలు వేతనంగా ఇస్తుంటే ఉపరాష్ట్రపతికి రూ.1.25 లక్షలు, గవర్నర్‌కు రూ.1.10 లక్షలు చొప్పున ఇస్తున్నారు. 
 
కానీ, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీసుకునే వేతనాలను పరిశీలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ముఖ్యంగా, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నెల వేతనం రూ.4.21 లక్షలు కాగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జీతం రూ.2.20 లక్షలు, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి వేతనం రూ.2.50 లక్షలు, మధ్యప్రదేశ్ వేతనం రూ.2 లక్షలు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి రూ.1.01 లక్షలుగా పొందుతున్నారు. 
 
అయితే, వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మాత్రం ఒక్క పైసా తీసుకోవడం లేదు. నెలవారీ వచ్చే వేతనాన్ని సీఎం రిలీఫ్ ఫండ్‌కు ఇస్తారు. మమత ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి ఒక్క రూపాయి కూడా వేతనంగా తీసుకోక పోవడం గమనార్హం. అలాగే, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మాత్రం నెలకు ఒక్కటంటే ఒక్క రూపాయిని వేతనంగా పొందుతున్నారు. 
 
మరోవైపు... మంత్రుల వేతనాలను 250 శాతం, ఎమ్మెల్యేల వేతనాలను 126 శాతం పెంచూతూ మహారాష్ట్ర అసెంబ్లీ బిల్లును పాస్ చేసింది. ఈ ఏడాది డిసెంబర్ నుంచి పెంచిన వేతనాలు అమల్లోకి వస్తాయి. అలాగే, మంత్రుల వేతనాలు రూ.3,20,000లకు, ఎమ్మెల్యేల వేతనాలు రూ.2,10,000లకు పెంచాలని ఢిల్లీ అసెంబ్లీ బిల్లు పాస్ చేసింది. అయితే కేంద్ర ప్రభుత్వం దీన్ని ఆమోదించాల్సివుంటుంది.
 

0 comments:

Post a Comment