మణిపూర్ రాజధాని ఇంఫాల్‌కి వెళితే
అక్కడ ఒక ప్రత్యేకమైన మార్కెట్ కనిపిస్తుంది. ఇందులో విశేషం ఏముంది
అంటారా... ఆ మార్కెట్‌లో అమ్మకందారులంతా మహిళలే కావడం విశేషం. ప్రపంచం
మొత్తం మీద స్త్రీలే నిర్వహిస్తున్న మార్కెట్ ఇదే కావడం విశేషం. దాదాపు
నాలుగువేల మంది మహిళలు ఈ మార్కెట్‌లో విక్రయదారులుగా ఉన్నారు.
ఇక్కడ అన్ని రకాల వస్తువులు, బట్టలు,
పండ్లు, తినుబండారాలను అమ్ముతుంటారు. ఇక్కడ లభించే వస్తువులు మరెక్కడా
లభించవని మహిళా విక్రయదారులు గర్వంగా చెపుతున్నారు. ఒకతరం నుంచి మరో
తరానికి సుమారు 500 ఏళ్ళుగా ఈ సంప్రదాయం కొనసాగుతోందట.
దీన్ని అక్కడి భాషలో ''ఇమా కీథేల్''
మార్కెట్ అని వ్యవహరిస్తారు. ఆంగ్లంలో ''మదర్స్ మార్కెట్'' అని దీని
అర్థమని అంటున్నారు. వస్తువులు కొనడానికి వచ్చే ప్రజలు, టూరిస్టులపట్ల
వీళ్ళంతా ఎంతో సభ్యతగా వ్యవహరిస్తారట. ఈ మహిళలందరూ పెళ్ళయిన వారే కావడం
గమనార్హం.
0 comments:
Post a Comment