అతిగా ఏంతిన్నా అజీర్తి ఖాయమే... ఇది గుర్తెరిగి తింటేనే పదికాలాలపాటు
ఆరోగ్యంగా ఉండొచ్చని పెద్దలు ఎప్పుడో చెప్పేశారు. అయితే, ఇప్పుడు
శాస్త్రవేత్తలు కొత్తది కనుక్కున్నారు. వారానికోసారేకదాని పూటుగా చికెన్,
మటన్, బిర్యానీ లాగించేస్తే చాలా ఇబ్బందే అంటున్నారు. కాలేయ సమస్యలకు
ఆల్కహాల్ తీసుకునే అలవాటు ఒక్కటే కారణం కాదని, అదేపనిగా చికెన్, మటన్
బిర్యానీలు తినేవారిలో కూడా కాలేయ సంబంధిత సమస్యలు ఎక్కువగా
వస్తాయంటున్నారు.
మద్యం సేవించే అలవాట్లు లేకున్నా, బిర్యానీ తినే అలవాటున్న వారిలో కాలేయ
సమస్యలు ప్రతి ఏడాది 30 నుంచి 35 శాతం వరకు పెరుగుతున్నాయని పరిశోధనలో
తేల్చారు. కూల్ డ్రింక్ సేవిస్తూ బిర్యానీ తింటే ఈ ప్రమాదం ఇంకా ఎక్కువట.
అకస్మాత్తుగా కడుపునొప్పి రావడం, ఛాతి నొప్పి, నీరసం వంటి లక్షణాలే కాలేయ
వ్యాధులకు సింప్టమ్స్ అని చెబుతున్నారు. బిర్యానీ తయారీలో వాడే వనస్పతి,
నెయ్యి, డాల్డా, మసాలా వంటి దినుసులను ఎక్కువగా వినియోగించడం, నాణ్యత లేని
మాంసాహారాన్ని వాడటం వల్ల కాలేయ సమస్యలు వస్తుంటాయని శాస్త్రవేత్తలు
అంటున్నారు.
0 comments:
Post a Comment