CSS Drop Down Menu

Friday, April 15, 2016

"కొత్త వివాదం రేకిత్తించడానికి రెఢీ" అయిన భూమాత బ్రిగేడ్ నాయకురాలు తృప్తీ దేశాయ్ !

పురుషులతో సమానంగా మహిళలకు ఆలయ ప్రవేశం కల్పించాల్సిందేనంటూ శనిసింగనాపూర్ ఆలయంలో నానా రభస చేసి..చివరికి కోర్టు మెట్లు ఎక్కి ఎట్టకేలకు పంతం నెగ్గించుకున్న భూమాత బ్రిగేడ్ నాయకురాలు తృప్తీ దేశాయ్ తాజాగా మరో వివాదం రేకిత్తించడానికి రెఢీ అయ్యారు.  సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొల్హాపూర్ మహాలక్ష్మీ దేవాలయంలోకి ప్యాంటు, కోటు వేసుకుని వెళ్లారు. దీనిని ఆలయ అధికారులు, పోలీసులు అడ్డుకున్నారు. ఇక్కడి నిబంధనల ప్రకారం చీరతోనే మహిలు లోపలికి వెళ్లాల్సి ఉంటుందని అధికారులు చెప్పడంతో, ఆమె మండిపడ్డారు. ఇష్టమొచ్చిన దుస్తులను ధరించనీయకుండా అడ్డుపడతారా? అని ప్రశ్నించారు. ఇంకేముంది ఈవిడ గారు టాక్ ఆఫ్ ది టౌన్ అవ్వడానికి కొత్త అస్త్రం దొరికినట్లైంది.

 కొన్ని దేవాలయాల్లో అమలవుతున్న సంప్రదాయ వస్త్ర ధారణ పద్ధతులు ఆమెకు నచ్చడం లేదంట. వేసుకునే దుస్తులపై నిబంధనలేంటని ప్రశ్నించారు. అంతటి ఆగకుండా ఇలాంటి నియమాల్ని ఇక ఉపేక్షించబోనని దీనిపై మరో ఉద్యమానికి రెఢీ అయ్యింది. దేశవ్యాప్తంగా పలు దేవాలయాల్లో అక్కడి కట్టుబాట్లు ప్రకారం వస్త్ర నిబంధనలు అమలవుతున్నాయి. తమిళనాడు, కర్ణాటకలోని పలు దేవాలయాల్లో పురుషులు షర్ట్ లేకుండా వస్తేనే అనుమతిస్తుండగా, కేరళలో చాలా దేవాలయాల్లో కేవలం పంచెతో మాత్రమే వెళితేనే అనుమతిస్తారు.

ఇక మహిళల విషయానికి వస్తే, జీన్స్, టీషర్ట్స్, మినీస్, షార్ట్స్ ధరించి వస్తే ఆలయాల్లోకి అనుమతించడం లేదు. తిరుమలలో సైతం మహిళలు చీర లేదా పంజాబీ డ్రస్, చుడీదార్ మాత్రమే ధరించాల్సి ఉంటుంది. ఇలాంటి వాటిని తాను వ్యతిరేకిస్తున్నానని భగవంతుడి దగ్గరికి పవిత్రమైన మనస్సుతో వెళ్లాలి కాని చీరలు, పంచెలు కట్టుకుని వెళ్లడమేంటి అంటూ ప్రశ్నిస్తున్నారు. యధా ప్రకారం సంప్రదాయవాదులు ఈమె తీరుపై మండిపడుతున్నారు. పబ్లిసిటీ కోసం దేవాలయ కట్టుబాట్లను మీరితే అంతు చూస్తామని వారు హెచ్చరిస్తున్నారు. మరి ఈ సరికొత్త వివాదం దేశంలో ఏ విధంగా ప్రకంపనలు సృష్టిస్తోంది వేచి చూడాలి.

0 comments:

Post a Comment