ఎన్నికల కోడ్ మొదలైన దగ్గర నుండి ఎన్నికలు జరిగే ప్రదేశాలలోని రాజకీయనాయకుల బేనర్ లను తొలగించి విగ్రహాలకు ముసుగులు వేస్తున్నారు.
కారణం ఏమిటంటే నాయకుల విగ్రహాలను ఓటర్లు చూస్తే వారి ప్రభావానికి లోనై ఆ నాయకులకు సంభందించిన పార్టీలకు ఓట్లేస్తారని.
కాని ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకోనేవరకు ఆటోలకు మైకులు కట్టి కేన్వాసింగ్ తో రోజంతా ఆ రాజకీయనాయకులను గుర్తు చేస్తూనే ఉంటారు.
కాని దాని గురించి పట్టించుకోరు .
ఆ విగ్రహాలు మాములుగా ఉన్నంతసేపు ఎవరు పట్టించుకోరు.
కాని వీళ్ళు విగ్రహాలకు ముసుగులు వేసేసరికి వాటి పక్కనుండి వెళ్ళే ఓటర్ల దృష్టి విగ్రహాల పై పడి ఆ నాయకులు గుర్తుకువస్తారు.
ఈ విధంగా ఎలక్షన్ కమిషన్ వారి అనాలోచిత నిర్ణయం వల్ల వారు ప్రత్యక్షంగా చేసిన పుణ్యమా అని పరోక్షంగా రాజకీయనాయకులు లాభపడుతున్నారు.
అందుకు రాజకీయపార్టీలన్ని కలిసి ఎలక్షన్ కమిషన్ వారికి కృతజ్ఞతలు తెలుపుకొంటే సరి !
ఎలక్షన్ కమిషన్ వారి పుణ్యమా అని కనీసం ఎలక్షన్లు జరిగినన్ని రోజులైనా ఎండకు ఎండకుండా వానకు తడవకుండా పిట్టలు రెట్టలు వేయకుండా దుమ్ము ధూళి పడకుండా తమ విగ్రహాలకు ముసుగులు వేసి కాపాడుతున్నందుకు పైలోకంలో ఉన్న వారి ఆత్మలు మాత్రం సంతోషిస్తుంటాయి.
ఏమంటారు? నేను రాసింది! నిజమేనంటారా ??
0 comments:
Post a Comment