హరికృష్ణకు సీటు ఇవ్వకుండా చేసి తెలుగుదేశం పార్టీ నుంచి హరికృష్ణ కుటుంబాన్ని దూరంగా ఉంచానని, బాలకృష్ణ తనకు అండగా ఉన్నంత వరకు ఏ గొడవా? ఉండదని! నారావారు సంబరపడుతున్నారు.
అంతటితో ఆగకుండా తెలుగుదేశం పార్టీ ప్రచారానికి ఎవరిని? బొట్టు పెట్టి పిలవాల్సిన అవసరం లేదని! ఇటు బాలకృష్ణ, అటు లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ ను ఉద్దేశించి పరోక్షంగా రెచ్చగొట్టే వాఖ్యలు చేసారు.
దాంతో తమసొంత పార్టీలోనే తనకు సీటు రాకపోయేసరికి తలకొట్టేసినట్టు ఆగ్రహంతో ఊగిపోతున్నహరికృష్ణ, దానికితోడు పుండుమీద కారం చల్లినట్టు వాళ్ళు మాట్లాడుతుండడంతో ఈ సీతయ్య ఏకొంప ముంచుతాడోయని తెలుగుదేశం పార్టీవాళ్ళు తలలు పట్టుకుంటున్నారు.
సీటు ఇవ్వకపోతే పోయారు! ఏదో కారణం సర్దిచెప్పి హరికృష్ణను, జూనియర్ ఎన్టీఆర్ ను తెలుగుదేశం పార్టీ ప్రచారానికి ఉపయోగించుకొంటే బావుండునని అనుకొంటున్నారు.
అసలే వై.ఎస్.ఆర్. పార్టీతో గట్టిపోటీని ఎదురుకొంటున్న ఇలాంటి తరుణంలో ఏచిన్న అవకాశం ఉన్నా ఉపయోగించుకోవలసింది పోయి భవిష్యత్తులో లోకేష్ కు జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడ పోటీ వస్తాడోనని? ఇప్పటినుండి వీళ్ళను దూరం చేసుకొంటే మనకొంప మనమే ముంచుకొన్నట్లవుతుందని! తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆందోళనకు గురవుతున్నాయి.
తెలుగుదేశం పార్టీకి ఇవే చిట్టచివరి ఎన్నికలని ఇప్పటికే సీట్ల కేటాయింపులో ఎన్నో అవకతవకలు? జరిగాయని గొడవలు జరుగుతుండగా, ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారని పేరున్న చంద్రబాబునాయుడు గారే? ఇలా చేసే సరికి "తాను కూర్చున్న కొమ్మను తానే నరుక్కుంటున్నాడని" తెలుగు తమ్ముల్లు తెగ భాదపడిపోతున్నారు!.
దాంతో హరికృష్ణ గారి కుటుంబం ఇప్పుడే నిర్ణయం తీసుకొంటుందోనని? అందరూ ఆసక్తితో ఎదురుచూస్తున్నారు!
0 comments:
Post a Comment