సభ్యసమాజం తలదించుకోవాల్సిన ఘోర సంఘటన ఇది.
'అ'మ్మలో సగం నా'న్న'లో సగం లక్షణాలను పునికిపుచ్చుకొని పుట్టినవాడే
"అన్న". అమ్మ, నాన్నల తర్వాత కుటుంబ పెద్దగా అందరి ఆలనాపాలన
చూడాల్సినవాడు. అటువంటివాడు రోడ్ సైడ్ రోమియోస్ నుంచి తన చెల్లెల్ని
కంటికి రెప్పలా కాపాడాల్సిన అన్నయ్యే తన పాలిట కామ పిశాచయ్యాడు.
తోడేలుగా మారి 11యేళ్లుగా అత్యాచారానికి పాల్పడూ వచ్చాడు.
పైగా అతడో డాక్టర్ కూడా.
ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను
గోప్యంగావుంచినపోలీసుఅధికారులు...
ఆ కామమృగాన్నికటకటాల్లోకి తోశారు.
హర్యానాలోని మనేసర్ పట్టణంలో ఈ దురాఘతం చోటుచేసుకుంది.
ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యుడిగా పనిచేస్తున్న సదరు కీచకుడు ప్రభుత్వ
సర్వేయర్‌గా పనిచేస్తున్న తన తోబుట్టువుపై గత 11యేళ్లుగా అత్యాచారం
చేస్తున్నాడు. దీనిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఇప్పుడామెకు 27 ఏళ్లు.
తాను టీనేజీలో ఉన్నప్పటి నుంచే అత్యాచారం చేస్తున్నాడని,ఎవరికైనా
చెబితే పరువెక్కడ పోతుందోనని ? మౌనంగా భరించానని ,
2005 తర్వాత మరింతగా పెట్రేగిపోయాడంటూ వాపోయింది.
కామంతో కళ్ళు మూసుకుపోయి, వావివరసలు మరచి సొంత చెల్లెలి పైనే
అత్యాచారానికి పాల్పడుతున్నఇలాంటి అన్నయ్యకు(క్షమించండి!
నిందితుడు అనకుండా అన్నయ్య అన్న పవిత్రమైన పదాన్నివాడినందుకు)
ఎలాంటి శిక్ష విదించాలో మీరే చెప్పండి?
ఆడవాళ్ళు ఏది చెబితే అదల్లా మనం నమ్మేస్తూ కూర్చోవాలా ? ఇన్ని సంవత్సరాలుగా.... అంటే అది అత్యాచారం అనిపించడం లేదు. ఏ లెక్కల దగ్గర అన్నకీ, చెల్లెలికీ గొడవలొచ్చాయో ? ఇప్పుడు బయటపడిపోయిందంతే.
ReplyDelete