CSS Drop Down Menu

Wednesday, April 30, 2014

"తొమ్మిది" చేసే మాయాజాలం !







Tuesday, April 29, 2014

ఇలాంటి వాడికి ! ఎలాంటి "శిక్ష" వేయాలి ?


సభ్యసమాజం తలదించుకోవాల్సిన ఘోర సంఘటన ఇది.
'అ'మ్మలో సగం నా'న్న'లో సగం లక్షణాలను పునికిపుచ్చుకొని పుట్టినవాడే
"అన్న". అమ్మ, నాన్నల తర్వాత కుటుంబ పెద్దగా అందరి ఆలనాపాలన
చూడాల్సినవాడు. అటువంటివాడు రోడ్ సైడ్ రోమియోస్ నుంచి తన చెల్లెల్ని
 కంటికి రెప్పలా కాపాడాల్సిన అన్నయ్యే తన పాలిట కామ పిశాచయ్యాడు.
 తోడేలుగా మారి 11యేళ్లుగా అత్యాచారానికి పాల్పడూ వచ్చాడు.
 పైగా అతడో డాక్టర్ కూడా.
 ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలను
 గోప్యంగావుంచినపోలీసుఅధికారులు...

ఆ కామమృగాన్నికటకటాల్లోకి తోశారు.
 హర్యానాలోని మనేసర్ పట్టణంలో ఈ దురాఘతం చోటుచేసుకుంది.
ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వైద్యుడిగా పనిచేస్తున్న సదరు కీచకుడు  ప్రభుత్వ
 సర్వేయర్‌గా పనిచేస్తున్న తన తోబుట్టువుపై గత 11యేళ్లుగా అత్యాచారం
 చేస్తున్నాడు. దీనిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.
  ఇప్పుడామెకు 27 ఏళ్లు.
 తాను టీనేజీలో ఉన్నప్పటి నుంచే అత్యాచారం చేస్తున్నాడని,ఎవరికైనా
చెబితే పరువెక్కడ పోతుందోనని ? మౌనంగా భరించానని ,
 2005 తర్వాత  మరింతగా పెట్రేగిపోయాడంటూ వాపోయింది.
 కామంతో కళ్ళు మూసుకుపోయి, వావివరసలు మరచి సొంత చెల్లెలి పైనే
  అత్యాచారానికి పాల్పడుతున్నఇలాంటి అన్నయ్యకు(క్షమించండి!
 నిందితుడు అనకుండా అన్నయ్య అన్న పవిత్రమైన పదాన్నివాడినందుకు)
ఎలాంటి శిక్ష విదించాలో మీరే చెప్పండి?

Monday, April 28, 2014

Sunday, April 27, 2014

"ఆపిల్" తో "బొమ్మలు"

ఆపిల్ తినడానికి చాలా బాగుంటుంది !

వాటితో చేసిన బొమ్మలు చూస్తే ఇంకా ఇంకా బావుంటాయి !!

























Saturday, April 26, 2014

కుక్కా ? కూతురా ?? ఏ ప్రేమ గొప్పది ???

                           "కన్నకూతురేమో" నడి రోడ్డుమీద !

                            "పెంపుడు కుక్కేమో" భుజంమీద !!



Friday, April 25, 2014

తాబేలు పై సవారీ !

మీరు ఇంత వరకు ఎన్నో రకాల జంతువులపై ఎన్నో రకాల జంతువుల సవారీలు చూసి ఉంటారు !

 కానీ తాబేలు పై కుక్క సవారీ చేయడం  ఇంత వరకు మీరు చూసి ఉండకపోవచ్చు.

 ఈ అద్భుతమైన దృశ్యం చూడాలనుకొంటే ఈ క్రింది వీడియో చూసి ఆనందించండి . 



Thursday, April 24, 2014

"ఆరు కొమ్ముల" గొర్రె !

మీరు ఇంతవరకు ఎన్నోరకాల గొర్రెలను చూసిఉంటారు.
 

మీరుచూసిన గొర్రెలకు "రెండు కొమ్ములే" ఉంటాయి.





 కాని ఎక్కువ కొమ్ములున్న గొర్రెల గురించి తెలుసుకోవాలంటే ఈ క్రింది

సమాచారం చూడండి.

అరుదైన జాతికి చెందినది ఈ "జాకోబ్" గొర్రె. 

ఇది నలుపు, తెలుపు రంగులు కలిగిఉంటుంది.

ఈజాతికి చెందిన జాకోబ్ గొర్రెలకు "రెండు" నుండి "ఆరుకొమ్ములు"
ఉంటాయి. 





ఎక్కువగా "నాలుగు కొమ్ములు" కలిగి ఉంటాయి.




 

వీటిని ఉన్ని, మాంసం,చర్మం కోసం, మరియు ఇతర జంతువుల నుండి
తమ పశుసంపదను రక్షించుకోవడానికి కాపలకోసం ఈ జాకోబ్ గొర్రెలను
పెంచుకొంటారు. 


ఈ జాకోబ్ గొర్రెలు మగవి సుమారు 54 నుండి 82 కేజీలు,


ఆడవి సుమారు 36 నుండి 54 కేజీలు బరువు ఉంటాయి.



Wednesday, April 23, 2014

కోటి తర్వాత ? లెక్కించడం ?? ఎలా ???

మనం సాధారణంగా సంఖ్యలను కోట్ల వరకే లెక్కించగలం. ఆపైన మనకు ఎలా లెక్కి౦చాలో తెలియదు. కాని మన పూర్వీకులు కోట్లకు పైన కూడా లెక్కించినట్లు ఆదారాలు ఉన్నాయి. అలాగే ఇతర దేశస్తులు కూడా ఆపై సంఖ్యలను లెక్కించదానికి కొన్ని సంఖ్యామానాలను వాడతారు. ఈ సంఖ్యామానాలను నేర్చుకొంటే ఎంత పెద్ద సంఖ్యలనైనా లెక్కించవచ్చు.


  ఉదాహరణకు 1223456789987654321 ఈ సంఖ్యను ఎలా చదవాలో చూడండి.

ఆంగ్ల, జర్మన్ పద్దతిలో:-1,223,456,789,987,654,321
ఒక ట్రిలియను,
రెండువoదలఇరవైమూడువేల,నాలుగువందలయాబైఆరుబిలియన్లు,
ఏడువందలఎనబైతొమ్మిదివేల,తొమ్మిదివందలఎనబైఏడుమిలియన్ల, ఆరువందలయాబైనాలుగువేల, మూడువందలఇరవైఒకటి.

 ఫ్రెంచ్, అమెరికన్ పద్దతిలో:-1,223,456,789,987,654,321
ఒక క్వింట్రిలియను,
 రెండువందల ఇరవైమూడు క్వాడ్రిలియన్ల,
 నాలుగువందలయాబైఆరు ట్రిలియన్ల,
 ఏడువందలఎనబైతొమ్మిది బిలియన్ల,
 తొమ్మిదివందలఎనబైఏడు మిలియన్ల,
 ఆరువందలయాబైనాలుగువేల, 
మూడువందలఇరవైఒకటి.

భారతీయ పద్దతిలో:-1,22,34,56,7,8,998,76,54,321
ఒక శంఖు,
రెండు మహా క్షోణుల రెండుక్షోణుల,
మూడు మహా పద్మముల నాలుగు పద్మముల, 
ఐదు మహా ఖర్వముల ఆరు ఖర్వముల, 
ఏడు న్యర్భుదముల,
ఎనిమిది అర్భుదముల, 
తొమ్మిదివందల తొంబైఎనిమిది కోట్ల,
డెబ్బైఆరు లక్షల,
యాభైనాలుగు వేల,
మూడువందల ఇరవై ఒకటి.





ఆపైన ఇంకాఉన్నవట. కాని మనకు లభించడం కష్టం. నేడు మనం శాస్త్ర, సాంకేతిక రంగాలలో ఎంతో అభివృద్ధి సాదించి, మరోవైపు కంప్యుటర్ యుగం లోకి అడుగెట్టినా, పూర్వకాలం ఎటువంటి సౌకర్యాలు లేకపోయినా, ఆనాటి శాస్త్రవేత్తల విజ్ఞానానికి, ఇప్పటికి ఎంతతేడా ఉన్నదో చూసారుగా! నిజంగా మనందరం ఆనాటి గణిత శాస్త్రజ్ఞుల మేధాసంపత్తికి జోహార్లు అర్పించవలసిందే!! 

Tuesday, April 22, 2014

ఇందులో నిజమెంత ? పవన్ జీ !

పవన్ కళ్యాణ్ ‘జనసేన’ పార్టీని ప్రకటిస్తూ ఏర్పాటు చేసిన మీటింగ్‌లోఆయన మాట్లాడిన తీరు చూసి అందరూ ‘అబ్బో పర్లేదు’ అనుకున్నారు.ఆ తర్వాత రెండోసారి ఆయన మాట్లాడిన తీరు చూసి ''ఈయనేదో కాస్త తేడాగావున్నాడే'' అనుకున్నారు. ఆ తర్వాత ఒక్కో స్టెప్‌లోనూ పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఇమేజ్ ఒక్కో స్టెప్ డౌన్ అవుతూ వస్తోంది. ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ అటు బీజేపీ, ఇటు తెలుగుదేశం చెప్పినట్టు ఆడే వ్యక్తి అనే ఇమేజ్ వచ్చేసింది. అయితే పవన్ పార్టీ వెనుక వున్న రహస్యాలు ఒక్కటొక్కటే బయటపడుతున్నాయి.
 రాజకీయ వర్గాల్లో ఈ రహస్యాల గురించి చర్చ భారీ స్థాయిలో జరుగుతోంది.
 పవన్ కళ్యాణ్ చేత పార్టీ పెట్టించడానికి, ఆ పార్టీ బీజేపీకి మద్దతు ఇవ్వడానికి ఐదు వందల కోట్లు చేతులు మారాయనేది తాజా చర్చ. ఈ చేతులు మారే వ్యవహారానికి మధ్యవర్తిలా వ్యవహరించింది ఘనత వహించిన తెలుగుదేశాధినేత చంద్రబాబు నాయుడట.

 అందరూ ఇంతకాలం జనసేన పార్టీ ప్రకటించిన తర్వాతే మోడీ నుంచి పవన్‌కి పిలుపు వచ్చందని, అప్పుడే ఆయన గుజరాత్‌కి వెళ్ళి మోడీని కౌగలించుకున్నాడని అనుకుంటున్నారు. అయితే అంతకుముందే మోడీతో పవన్ సీక్రెట్‌గా మాట్లాడుకుని 500 కోట్ల డీల్ కుదర్చుకున్నాడని అనుకుంటున్నారు.

 ఆమధ్య హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో ‘అత్తారింటికి దారేది’ సినిమా
 సక్సెస్ మీట్ జరిగిన తర్వాత పవన్‌కి చంద్రబాబు నుంచి పిలుపువచ్చిందట.
 వెంటనే పవన్ చంద్రబాబుని కలవటం, చంద్రబాబు మోడీతో పవన్‌ని లింక్ చేయడం జరిగిపోయిందట. ఈ రకంగా పవన్ కళ్యాణ్‌ని ఇమేజ్‌ని ఓట్లుగా మలచుకోవడానికి బీజేపీ, టీడీపీ కలసికట్టుగా కథ నడిపారని రాష్ట్ర రాజకీయాల్లో చర్చించుకుంటున్నారు.

 పోటీ చేయడానికి సరిఅయిన అభ్యర్ధులు దొరకలేదని ఎవరినైనా పోటికి దింపితే ఓట్లు చీలిపోయి బీజేపీ,  తెలుగుదేశం పార్టీలకు నష్టంజరుగుతుందని చెప్పడం, మరియు తన స్నేహితుడు అయిన పి.వి.పి.కి సీటు రాకపోయినా వాళ్ళతో గట్టిగా చెప్పి ఒప్పించలేకపోవడం,ఇండిపెండెంటుగా పోటీచేస్తానన్నా తనమద్దతు ఉండదని చెప్పడం దీనికి ఉదాహరణగా చెబుతున్నారు.


Monday, April 21, 2014

పసిపిల్లాడు నుంచి ! పండు ముసలాడి వరకు !!

                                   ఎ. బి. సి. డి లు రాకపోయినా !


                                   అక్షర జ్ఞానం లేకపోయినా !!


                               అందరికి  కావాలి  లాప్ టాప్ !!!





Saturday, April 19, 2014

హరికృష్ణ ! కొంపముంచుతాడా?

హరికృష్ణకు సీటు ఇవ్వకుండా చేసి తెలుగుదేశం పార్టీ నుంచి హరికృష్ణ కుటుంబాన్ని దూరంగా ఉంచానని, బాలకృష్ణ తనకు అండగా ఉన్నంత వరకు ఏ గొడవా? ఉండదని! నారావారు  సంబరపడుతున్నారు. 

అంతటితో ఆగకుండా తెలుగుదేశం పార్టీ ప్రచారానికి ఎవరిని? బొట్టు పెట్టి పిలవాల్సిన అవసరం లేదని! ఇటు బాలకృష్ణ, అటు లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ ను ఉద్దేశించి  పరోక్షంగా రెచ్చగొట్టే వాఖ్యలు చేసారు. 

దాంతో తమసొంత పార్టీలోనే తనకు సీటు రాకపోయేసరికి తలకొట్టేసినట్టు ఆగ్రహంతో ఊగిపోతున్నహరికృష్ణ, దానికితోడు పుండుమీద కారం చల్లినట్టు వాళ్ళు మాట్లాడుతుండడంతో ఈ సీతయ్య ఏకొంప ముంచుతాడోయని తెలుగుదేశం పార్టీవాళ్ళు తలలు పట్టుకుంటున్నారు. 

సీటు ఇవ్వకపోతే పోయారు! ఏదో కారణం సర్దిచెప్పి హరికృష్ణను, జూనియర్ ఎన్టీఆర్ ను తెలుగుదేశం పార్టీ ప్రచారానికి ఉపయోగించుకొంటే బావుండునని అనుకొంటున్నారు. 

అసలే వై.ఎస్.ఆర్. పార్టీతో గట్టిపోటీని ఎదురుకొంటున్న ఇలాంటి తరుణంలో ఏచిన్న అవకాశం ఉన్నా ఉపయోగించుకోవలసింది పోయి భవిష్యత్తులో లోకేష్ కు జూనియర్  ఎన్టీఆర్ ఎక్కడ పోటీ వస్తాడోనని? ఇప్పటినుండి వీళ్ళను దూరం చేసుకొంటే మనకొంప మనమే ముంచుకొన్నట్లవుతుందని! తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆందోళనకు గురవుతున్నాయి. 

తెలుగుదేశం పార్టీకి ఇవే చిట్టచివరి ఎన్నికలని ఇప్పటికే సీట్ల కేటాయింపులో ఎన్నో అవకతవకలు? జరిగాయని గొడవలు జరుగుతుండగా, ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారని పేరున్న  చంద్రబాబునాయుడు గారే? ఇలా చేసే సరికి "తాను కూర్చున్న కొమ్మను తానే నరుక్కుంటున్నాడని" తెలుగు తమ్ముల్లు తెగ భాదపడిపోతున్నారు!.

దాంతో హరికృష్ణ గారి కుటుంబం ఇప్పుడే నిర్ణయం తీసుకొంటుందోనని? అందరూ ఆసక్తితో ఎదురుచూస్తున్నారు!

Thursday, April 17, 2014

ఇదెక్కడి?విచిత్రం!




మొన్నటి దాకా వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలో ఉండి సీటు రాదని తెల్సిన తరువాత కోట్లకి సీట్లు అమ్ముకున్నారని మీడియాలో చెప్పి ఆతర్వాత బి.జె.పి.లో చేరారు  రఘురామ కృష్ణంరాజు గారు.

  బి.జె.పి.లో కూడా సీటు రాకపోయేసరికి ఖంగుతిని నర్సాపురం పార్లమెంటు  సీటుకి ఇండిపెండెంటుగా పోటీచేయడానికి సిద్దపడ్డారు. అంతవరకు బాగానేవుంది.ఆశ్చర్యంకొలిపే విషయం ఏమిటంటే? నామినేసన్ బి.జె.పి, తెలుగుదేశం రెండింటి తరపున వేసి అందరిని ఆశ్చర్యపడేటట్లు చేసారు. కొసమెరుపు ఏమిటంటే? మీడియా వాళ్ళు మీరే పార్టీ తరపున పోటీ చేస్తున్నారంటే?? నాపార్టీ తరపునే! అంటూ నర్మగర్భంగా చెప్పారు. 

ఇది చూసిన మిగతావాళ్ళు ఏం తెలివయ్యా బాబూ! ఈ సంగతి ముందే తెలిస్తే మేముకూడా రెండు, మూడు పార్టీల తరపున నామినేసన్లు వేసిపారేస్తే ఏదో ఒక పార్టీ సీటు ఇచ్చునని గొణుకుంటున్నారట.

Wednesday, April 16, 2014

మరీ ఇంత వెటకారమా? రఘువీరాజీ!

ఆంధ్రా పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి గారు మీడియా వాళ్ళతో మాట్లాడుతూ సీమాంధ్ర కాంగ్రెస్ పార్టీలో శాసనసభకు జరిగే ఎన్నికలలో ఎమ్మేల్యేలుగా పోటీ చేయడానికి 200 సీట్లకు ఏకంగా 1300 మంది పోటీ పడ్డారని, తన రాజకీయ జీవితంలో ఇప్పటివరకు ఎప్పుడు ఇంతమంది పోటీ పడడం చూడలేదని, కాంగ్రెస్ ఎమ్మేల్యే టిక్కెట్ లకు ఇంత డిమాండ్ రావడం ఇదే మొదటిసారని ఎంతో గొప్పగా చెప్పారు. 

           రఘువీరాజీ మరీ ఇంత వెటకారం అయితే ఎలాగండి బాబూ! ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ అడ్రెస్ గల్లంతవుతుందని, కనీసం డిపాజిట్లు కూడా రావని సర్వేలన్నీ చెబుతుంటే మీరు మీపార్టీ గురించి గొప్పలు చెప్పుకోవచ్చు కాని మరీ ఇంత ఇదిగా జనాల చెవులలో పూవులు పెట్టకుండా ఏకంగా కాలిప్లవర్ పెడితే ఎలాగండి బాబూ!! 

         మీరే ఇంత ఇదిగా చెబుతుంటే, కొత్తగా వచ్చే ప్రభుత్వం మాదేనని పోటీపడుతున్న వై.యస్.ఆర్.కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ఇంకెంత గొప్పలు చెప్పాలి. ఏమంటారు?

Tuesday, April 15, 2014

"టి. డి. పి". లో మొదలైన కొత్త గొడవ ?

                 తెలంగాణ లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు వేసిన డోర్ పోస్టర్లు కొత్త సమస్యను సృష్టించాయి. హుజూర్‌నగర్ నియోజకవర్గంలో టిడిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్న స్వామిగౌడ్ తన పోస్టర్లలో "పవన్ కల్యాణ్" ఫొటో వేశారు.

      ఇది "జూనియర్ ఎన్టీఆర్" అభిమానులకు ఆగ్రహం తెప్పించింది.పోస్టర్లలో  "ఎన్టీఆర్" ఫొటో ఎందుకు లేదని? వారు పోస్టర్లను చింపి దగ్ధం చేశారు.పోస్టర్లలో పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఫొటో ఉందని, అలాంటప్పుడు పోస్టర్లను మీరెలా? దగ్ధం చేస్తారంటూ ఈ వ్యవహారాన్ని టిడిపి కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు.ఈ నేపథ్యంలో టిడిపి కార్యకర్తలకు, జూ ఎన్టీఆర్ అభిమానులకు మధ్య ఘర్షణ తలెత్తింది.

                       అప్పుడే మొదలైన ఈ ప్రచ్చనయుద్ధం రాబోయే రోజులలో ఇంకెలా?  ఉండబోతుందోనని??  ఈ గొడవల వల్ల మన కొంప ఎక్కడ ములుగుతుందోనని??? తెలుగుదేశం వర్గాలు ఆందోళన పడుతున్నాయి!

Monday, April 14, 2014

కదులుతున్న "నట్ల" మాయాజాలం !

ఈ వీడియో గాని చూసారా మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపడవలసిందే! ఎందుకంటే  మీరు ఎన్ని సార్లు చూసినా గాని మరలా  మరలా చూడాలనిపిస్తుంది!! 
అదే ఈ వీడియో యొక్క గొప్పతనం !!!



   


Sunday, April 13, 2014

కుక్క ఫోటో కార్టూన్


Saturday, April 12, 2014

చివరకి బాలయ్యే గెలిచాడు!

నందమూరి కుటుంబం వారి హిందూపురం ఎమ్మేల్యే టిక్కెట్ రేసులో చివరకి బాలకృష్ణకే విజయం దక్కింది. పాపం హరికృష్ణ గారి ఆశలు అడియాసలే అయ్యాయి. ఒక వైపు చూస్తే ఎన్టీఆర్ గారి కుమారులు మరియు బావమర్ధులు, రెండోవైపు చూస్తే తన వియ్యంకుడు మరియు లెజెండ్ సినిమాతో మళ్ళి పుంజుకున్న బాలయ్య. ఇతన్ని ప్రచారానికి తిప్పుకుంటే తెలుగుదేశం పార్టీకి నాలుగు ఓట్లు రాలతాయని ఆశ ఒక వైపు. హరికృష్ణకు గాని సీటిస్తే ప్రచారానికి జూనియర్ ఎన్టీఆర్ వస్తే లోకేష్ కు ఎక్కడ పోటీకి వస్తాడోనని ఒకవైపు. అదే హరికృష్ణకు గాని సీటు ఇవ్వకుపోతే కోపంతో ప్రచారానికి రాకుండా తన సినిమాలకే పరిమితమైపోతాడని దాంతో రాజకీయాలలో తనకు హరికృష్ణ గొడవ, యువ నేతగా ఎదుగుతున్న లోకేష్ కు జూనియర్ ఎన్టీఆర్ గొడవ తప్పుతుందని ఒకే దెబ్బకు రెండు పిట్టలు అనట్టు ఎంతో ఉహాత్మకంగా అడుగులు వేసి చివరకు బాలకృష్ణకే సీటు కేటాయించారు.అవునంటారా? కాదంటారా??  

Friday, April 11, 2014

"ఎనిమిది" చేసే అద్భుతం !


Thursday, April 10, 2014

కాపలా కుక్కకే "సీటు" లేదు!

సికింద్రాబాద్ కంటోన్మెంట్  ఏరియా మాజీ ఎమ్మేల్యే పి.శంకరరావు గారు 

మాట్లాడుతూ "ఇందిరాగాంధీ కుటంబానికి విశ్వాసపాత్రుడైన   కుక్కలాంటి 

వాడినని, సోనియాగాంధీ పై ఎవరైనా అవాకులు చవాకులూ వాగితే 

ఊరుకోనని,ఒంటిపై ఈగ కూడా వాలనివ్వనని వారి ఇంటికి "వాచ్ డాగ్" 

లాంటివాడినని" అనేవారు. అన్నట్లుగానే ఎవరైనా విమర్సిస్తే అంతఎత్తున 

ఎగిరిపడేవారు.

అంతేగాక తెలంగాణా ఇచ్చిన సోనియాగాంధీకి గుడి కూడా కట్టిస్తునారు. 

విగ్రహాన్ని కూడా తయారు చేయిస్తున్నారు.



పాపం ఇంత చేస్తున్న శంకరరావు గారి విశ్వాస౦ అధిస్టానానికి

కనబడలేదేమో? ఈయన చూపిన విశ్వాసానికి ఇంత వరుకు చేసింది  చాలు

 అన్నుకున్నారేమో?? భూవివాదం  అనే వంకతో ఎమ్మేల్యే టిక్కెట్ 

ఇవ్వకుండా పక్కనపెట్టేసారు.

పాపం! శంకరన్నకు ఇప్పటికైనా తెలిసిందో? లేదో?? కాంగ్రెస్ అధిస్టానానికి

 ఎంతటి విశ్వాసపాత్రుడైనా అవసరం తీరిపోయాక బయటకు నెట్టేస్తారన్న

 నిజం శంకరన్నకు తెలియంది కాదు!

ఇంత జరిగిన తరువాత సోనియాగాంధీ గుడి సంగతి ఏమౌతుందో శంకరన్నకే

 తెలియాలి.

Wednesday, April 9, 2014

కళ్ళు కాని కళ్ళు



Monday, April 7, 2014

మీకేనా ? మాక్కూడా !!



ఈ క్రింది వీడియో గాని చూసారా మీరు కచ్చితంగా అవాక్కవ్వలసిందే! 

ఆడవారు కనుక  ఈ  వీడియో గాని చూసారా ఈర్ష్య పడవలసిందే !!

ఈ వీడియో చూసిన వెంటనే ఎలాంటి వారికైనా నవ్వు రావాల్సిందే !!!



Sunday, April 6, 2014

అర్ధం లేని ఆరోపణ?

నేడు జరుగుతున్నZPTC, MPTC ఎన్నికలలో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలకు చెందిన కొందరు ఏజెంట్లు పోలింగుబూతుల్లొ తిరుగుతున్నను "ఫ్యాన్" తీసివేయాలని గొడవచేసారట. 

ఎందుకంటే "ఫ్యాన్" వైఎస్ఆర్  కాంగ్రెస్ పార్టీ గుర్తుఅని. 

దానికి పోలింగు అధికారులు ఒప్పుకోకపోవడంతో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ఏజెంట్లు ఘర్షణకు దిగేసరికి, 

వైఎస్ఆర్  కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లు అధికారులతో "దీనికి ఇంత గొడవ ఎందుకండీ వాళ్ళన్నది సబబే కదా! 

పార్టీలకు సంభందించిన గుర్తులు ఉండకూడదంటున్నారు కాబట్టి,

ముందుగా కాంగ్రెస్ పార్టీకు చెందిన గుర్తు "హస్తం" కాబట్టి గుత్తుదగ్గరకు
చేతిని తీసేసిరమ్మనండి" అనేసరికి ఏమనాలో తెలియక తెల్లమొఖం వేసి పోలింగ్ కానిచ్చారట!

పార్టీలకే మేలు చేస్తున్నఎన్నికల కోడ్

ఎన్నికల కోడ్ మొదలైన దగ్గర నుండి ఎన్నికలు జరిగే ప్రదేశాలలోని రాజకీయనాయకుల బేనర్ లను తొలగించి విగ్రహాలకు ముసుగులు వేస్తున్నారు.




 కారణం ఏమిటంటే నాయకుల విగ్రహాలను ఓటర్లు చూస్తే వారి ప్రభావానికి లోనై  ఆ నాయకులకు సంభందించిన పార్టీలకు ఓట్లేస్తారని.

కాని ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకోనేవరకు ఆటోలకు మైకులు కట్టి కేన్వాసింగ్ తో రోజంతా ఆ రాజకీయనాయకులను గుర్తు చేస్తూనే ఉంటారు. 

కాని దాని గురించి పట్టించుకోరు .

ఆ విగ్రహాలు మాములుగా ఉన్నంతసేపు ఎవరు పట్టించుకోరు. 

కాని వీళ్ళు విగ్రహాలకు ముసుగులు వేసేసరికి వాటి పక్కనుండి వెళ్ళే ఓటర్ల దృష్టి విగ్రహాల పై పడి ఆ  నాయకులు గుర్తుకువస్తారు. 

ఈ విధంగా ఎలక్షన్ కమిషన్ వారి అనాలోచిత నిర్ణయం వల్ల  వారు ప్రత్యక్షంగా చేసిన  పుణ్యమా అని పరోక్షంగా రాజకీయనాయకులు లాభపడుతున్నారు. 

అందుకు రాజకీయపార్టీలన్ని  కలిసి ఎలక్షన్ కమిషన్ వారికి కృతజ్ఞతలు తెలుపుకొంటే సరి !

ఎలక్షన్ కమిషన్ వారి పుణ్యమా అని కనీసం ఎలక్షన్లు జరిగినన్ని రోజులైనా ఎండకు ఎండకుండా వానకు తడవకుండా పిట్టలు రెట్టలు వేయకుండా దుమ్ము ధూళి పడకుండా తమ విగ్రహాలకు ముసుగులు వేసి కాపాడుతున్నందుకు  పైలోకంలో ఉన్న వారి ఆత్మలు మాత్రం సంతోషిస్తుంటాయి. 

ఏమంటారు? నేను రాసింది! నిజమేనంటారా ??   


Saturday, April 5, 2014

దాసరి పేల్చన్నున్న బాంబు

బ్రోకర్ -2 ఆడియో ఫంక్షన్ లో దాసరి నారాయణ రావు గారు మాట్లాడుతూ 
"నా చిన్నపుడు బ్రోకర్ అంటే నీచంగా చూసే వారు కానీ ఇప్పుడు అది పవిత్రమైన పదంగా మారిపోయింది. 

 ఇల్లు అద్దెకు ఇవ్వడం దగ్గర నుండి బోఫోర్సు కుంభకోణం వరకు బ్రోకర్ లేనిదే పని జరగదు. 

చివరకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరగడానికి కూడా ఒక పెద్ద బ్రోకర్ ఉన్నాడు. 

అది ఎవరు ? అన్నది సమయం వచిన్నపుడు బయట పెడతా" ! అని పెద్ద  బాంబును పేల్చడానికి వత్తు వెలిగించారు. 

అది గట్టిగా పేలి "భూప్రకంపనలు" సృష్టిస్తుందో లేక మన మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారిలా "తుస్సు"మనిపిస్తారో వేచి చూడాలి మరి !   

Friday, April 4, 2014

Thursday, April 3, 2014

ఆవులింత

ఆవులింత (Yawn) నిద్ర వచ్చేముందు జరిగే అసంకల్పిత చర్య.

ఆవులించినప్పుడు మనం చెవులు రిక్కించి, గట్టిగా ఊపిరి పీల్చి కొంత సమయం తర్వాత విడిచిపెడతాము.

ఆవులించినప్పుడు ఒళ్ళు విరుచుకుంటే దానిని పాండిక్యులేషన్ (Pandiculation) అంటారు.



 

సామాన్యంగా అలసిపోయినప్పుడు, శారీరకమైన లేదా మానసికమైన ఒత్తిడికి లోనయినప్పుడు, ఏమీ తోచనప్పుడు ఆవులింతలు వస్తాయి.

మానవులలో ఆవులింతలు ఒక విధమైన అంటువ్యాధి వంటివి.

అనగా ఆవులించే వ్యక్తిని చూసినా లేదా ఆవులించడం గురించి ఆలోచించినా ఇవి ఎక్కువగా వస్తాయి.


  ఆవులింతలు చింపాంజీలలో, మరికొన్ని జంతువులలో కూడా కనిపిస్తాయి.

  

 


ఆవులింతలకు ప్రధానమైన కారణం మెదడు యొక్క ఉష్ణోగ్రతను నియంత్రించడం అని గుర్తించారు.

ముందుగా భావించినట్లు ఆక్సిజన్ సరఫరా తక్కువ కావడం అన్నది నిర్ధారించలేకపోయారు.

నిజానికి ఆవులించినప్పుడు శరీరానికి ఆక్సిజన్ తక్కువగా అందడమే.




మనిషిలో ఆవులింత సుమారు 6 సెకన్ల పాటు ఉంటుంది.