CSS Drop Down Menu

Wednesday, April 23, 2014

కోటి తర్వాత ? లెక్కించడం ?? ఎలా ???

మనం సాధారణంగా సంఖ్యలను కోట్ల వరకే లెక్కించగలం. ఆపైన మనకు ఎలా లెక్కి౦చాలో తెలియదు. కాని మన పూర్వీకులు కోట్లకు పైన కూడా లెక్కించినట్లు ఆదారాలు ఉన్నాయి. అలాగే ఇతర దేశస్తులు కూడా ఆపై సంఖ్యలను లెక్కించదానికి కొన్ని సంఖ్యామానాలను వాడతారు. ఈ సంఖ్యామానాలను నేర్చుకొంటే ఎంత పెద్ద సంఖ్యలనైనా లెక్కించవచ్చు.


  ఉదాహరణకు 1223456789987654321 ఈ సంఖ్యను ఎలా చదవాలో చూడండి.

ఆంగ్ల, జర్మన్ పద్దతిలో:-1,223,456,789,987,654,321
ఒక ట్రిలియను,
రెండువoదలఇరవైమూడువేల,నాలుగువందలయాబైఆరుబిలియన్లు,
ఏడువందలఎనబైతొమ్మిదివేల,తొమ్మిదివందలఎనబైఏడుమిలియన్ల, ఆరువందలయాబైనాలుగువేల, మూడువందలఇరవైఒకటి.

 ఫ్రెంచ్, అమెరికన్ పద్దతిలో:-1,223,456,789,987,654,321
ఒక క్వింట్రిలియను,
 రెండువందల ఇరవైమూడు క్వాడ్రిలియన్ల,
 నాలుగువందలయాబైఆరు ట్రిలియన్ల,
 ఏడువందలఎనబైతొమ్మిది బిలియన్ల,
 తొమ్మిదివందలఎనబైఏడు మిలియన్ల,
 ఆరువందలయాబైనాలుగువేల, 
మూడువందలఇరవైఒకటి.

భారతీయ పద్దతిలో:-1,22,34,56,7,8,998,76,54,321
ఒక శంఖు,
రెండు మహా క్షోణుల రెండుక్షోణుల,
మూడు మహా పద్మముల నాలుగు పద్మముల, 
ఐదు మహా ఖర్వముల ఆరు ఖర్వముల, 
ఏడు న్యర్భుదముల,
ఎనిమిది అర్భుదముల, 
తొమ్మిదివందల తొంబైఎనిమిది కోట్ల,
డెబ్బైఆరు లక్షల,
యాభైనాలుగు వేల,
మూడువందల ఇరవై ఒకటి.





ఆపైన ఇంకాఉన్నవట. కాని మనకు లభించడం కష్టం. నేడు మనం శాస్త్ర, సాంకేతిక రంగాలలో ఎంతో అభివృద్ధి సాదించి, మరోవైపు కంప్యుటర్ యుగం లోకి అడుగెట్టినా, పూర్వకాలం ఎటువంటి సౌకర్యాలు లేకపోయినా, ఆనాటి శాస్త్రవేత్తల విజ్ఞానానికి, ఇప్పటికి ఎంతతేడా ఉన్నదో చూసారుగా! నిజంగా మనందరం ఆనాటి గణిత శాస్త్రజ్ఞుల మేధాసంపత్తికి జోహార్లు అర్పించవలసిందే!! 

0 comments:

Post a Comment