CSS Drop Down Menu

Tuesday, April 22, 2014

ఇందులో నిజమెంత ? పవన్ జీ !

పవన్ కళ్యాణ్ ‘జనసేన’ పార్టీని ప్రకటిస్తూ ఏర్పాటు చేసిన మీటింగ్‌లోఆయన మాట్లాడిన తీరు చూసి అందరూ ‘అబ్బో పర్లేదు’ అనుకున్నారు.ఆ తర్వాత రెండోసారి ఆయన మాట్లాడిన తీరు చూసి ''ఈయనేదో కాస్త తేడాగావున్నాడే'' అనుకున్నారు. ఆ తర్వాత ఒక్కో స్టెప్‌లోనూ పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఇమేజ్ ఒక్కో స్టెప్ డౌన్ అవుతూ వస్తోంది. ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ అటు బీజేపీ, ఇటు తెలుగుదేశం చెప్పినట్టు ఆడే వ్యక్తి అనే ఇమేజ్ వచ్చేసింది. అయితే పవన్ పార్టీ వెనుక వున్న రహస్యాలు ఒక్కటొక్కటే బయటపడుతున్నాయి.
 రాజకీయ వర్గాల్లో ఈ రహస్యాల గురించి చర్చ భారీ స్థాయిలో జరుగుతోంది.
 పవన్ కళ్యాణ్ చేత పార్టీ పెట్టించడానికి, ఆ పార్టీ బీజేపీకి మద్దతు ఇవ్వడానికి ఐదు వందల కోట్లు చేతులు మారాయనేది తాజా చర్చ. ఈ చేతులు మారే వ్యవహారానికి మధ్యవర్తిలా వ్యవహరించింది ఘనత వహించిన తెలుగుదేశాధినేత చంద్రబాబు నాయుడట.

 అందరూ ఇంతకాలం జనసేన పార్టీ ప్రకటించిన తర్వాతే మోడీ నుంచి పవన్‌కి పిలుపు వచ్చందని, అప్పుడే ఆయన గుజరాత్‌కి వెళ్ళి మోడీని కౌగలించుకున్నాడని అనుకుంటున్నారు. అయితే అంతకుముందే మోడీతో పవన్ సీక్రెట్‌గా మాట్లాడుకుని 500 కోట్ల డీల్ కుదర్చుకున్నాడని అనుకుంటున్నారు.

 ఆమధ్య హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో ‘అత్తారింటికి దారేది’ సినిమా
 సక్సెస్ మీట్ జరిగిన తర్వాత పవన్‌కి చంద్రబాబు నుంచి పిలుపువచ్చిందట.
 వెంటనే పవన్ చంద్రబాబుని కలవటం, చంద్రబాబు మోడీతో పవన్‌ని లింక్ చేయడం జరిగిపోయిందట. ఈ రకంగా పవన్ కళ్యాణ్‌ని ఇమేజ్‌ని ఓట్లుగా మలచుకోవడానికి బీజేపీ, టీడీపీ కలసికట్టుగా కథ నడిపారని రాష్ట్ర రాజకీయాల్లో చర్చించుకుంటున్నారు.

 పోటీ చేయడానికి సరిఅయిన అభ్యర్ధులు దొరకలేదని ఎవరినైనా పోటికి దింపితే ఓట్లు చీలిపోయి బీజేపీ,  తెలుగుదేశం పార్టీలకు నష్టంజరుగుతుందని చెప్పడం, మరియు తన స్నేహితుడు అయిన పి.వి.పి.కి సీటు రాకపోయినా వాళ్ళతో గట్టిగా చెప్పి ఒప్పించలేకపోవడం,ఇండిపెండెంటుగా పోటీచేస్తానన్నా తనమద్దతు ఉండదని చెప్పడం దీనికి ఉదాహరణగా చెబుతున్నారు.


2 comments:

  1. Jagan may give 1000cr right If Pawan joins with him or Jagna doesnt need pawan or congress wont give. How much money somebody should have to bet 500cr in elections.Its just like reliance killed YSR for asking share in KG basin.Reliance most of the investment form chevron which in turn GeorgeBush and co's company. Some rumors looks very good and we will feel it might be true.

    ReplyDelete
  2. 500 కోట్లా అంత సీను ఉందంటే నమ్మశక్యంగా లేదు. ఇలా అయితే పవన్ కళ్యాణ్ కంటే వంద రెట్లు క్రేజ్ ఉన్న రజనీకాంత్, సల్మాన్ ఖాన్ వగైరాలకు ఎంతిచ్చి ఉండాలి?

    ReplyDelete