CSS Drop Down Menu

Tuesday, June 30, 2015

"చిలుక మనిషిలా ఎలా మాట్లాడగలదో" కనిపెట్టేసారు!

సినిమాల్లోనూ, చిలక జోస్యం చెప్పేవారి దగ్గర కూడా రామచిలుకలు చిన్నచిన్న మాటలు మాట్లాడటం చూసే ఉంటాం. కొంతమంది ఇళ్లలో అయితే పెంపుడు చిలుకలు ఏకంగా మనం ఏది మాట్లాడితే అది కూడా అలాగే మాట్లాడేస్తుంది. కాకపోతే స్పష్టత లేకపోయినప్పటికీ ధ్వని మాత్రం మనం చెప్పిన మాటలను పోలి ఉంటుంది. అసలు రామచిలుక మనిషిలా ఎలా మాట్లాడగలుగుతోంది...? మిగిలిన జీవరాశులు మనిషిలా మాట్లాడలేకపోతున్నాయి కదా.
 
  వీటికి మాత్రమే అంత తెలివి ఎక్కడిది... ఎలా మాట్లాడగలుగుతున్నాయి అనే ప్రశ్నలపై అధ్యయనకారులు ఎప్పటి నుంచో పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఈమధ్య నెథర్లాండ్స్, డెన్మార్కులకు చెందిన కొందరు పరిశోధకులు దీనిపై చేసిన పరిశోధనల్లో అసలు సంగతేమిటో వెలుగుచూసిందట. అదేమంటే... రామచిలుకల మెదడు ఇతర పక్షుల మాదిరి కాకుండా కొంత వైవిధ్యంగా ఉన్నట్లు కనుగొన్నారు. 
 
నిజానికి రామచిలుక మెదడు గురించి ఎన్నో ఏళ్ల క్రితం తెలుసుకున్నప్పటికీ, చిలుక ఎలా మాట్లాడగలుగుతుందనే కోణంలో దానిని పరిశీలించలేదు. తాజాగా ఈ కోణంలో పరిశీలించిన పరిశోధకులకు కొన్ని ఆసక్తికర అంశాలు బయటకు వచ్చాయట. మనిషి చెప్పే మాటలను గ్రహించే శక్తి చిలుక మెదడుకు ఉన్నట్లు కనుగొన్నారు. అందువల్లనే చిలుక మనం మాట్లాడే మాటలను తిరిగి మాట్లాడగలుగుతుందని చెపుతున్నారు.
 


Monday, June 29, 2015

తెలంగాణ సిఎం కేసీఆర్ ను ఏడ్పించిందెవరు?

వారు మాట్లాడే ఒక్కొక్క మాట ఆయన గుండెలు పిండేశాయి. వారు మాట్లాడుతుంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుకు ఏడుపు తన్నుకొచ్చింది. అయినా బిగబట్టుకున్నారు. ఆయనను అంతగా ఏడ్పించిన వారెవరు..? అంత ధైర్యం ఎవరికుంది అనే అనుమానం వెంటనే కలుగుతుంది. ఇలా ఆయనను ఏడ్పించిన వారు ఇద్దరు అనాథ పిల్లలు.. వారి తెలివితేటలు చూసి అబ్బురపడిన ఆయన మరుక్షణమే మేము అనాథలం అనే మాట విని కేసీఆర్ తట్టుకోలేకపోయారు. వస్తున్న ఏడుపును నిలబెట్టుకున్నారు. ఈ సంఘటనను మంగళవారం ఆయన స్వయంగా తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. 
 
గజ్వేలు నియోజకవర్గంలో ఓ కార్యక్రమానికి వెళ్లారు. అక్కడో ఇద్దరు అమ్మాయిలు గణితంలో ఏది అడిగినా టకటకా సమాధానాలిచ్చారు. అబాకస్‌లో అద్భుత ప్రతిభ కనబరిచారు. కార్యక్రమం ముగిశాక వాళ్లిద్దరూ కేసీఆర్ దగ్గరికొచ్చి రెండు చేతులు జోడించి నమస్కారం పెట్టి, ‘సార్... మేము పదో తరగతి చదువుకుంటున్నాం. తర్వాత ఏమి చేయాలో తెలియడం లేదు. మేము అనాధలం. మాకెవరూ లేరు సార్..’ అన్నారు. 
 
అనాధలం అనే మాట ఆ చిన్నారుల నోటి నుంచి రావడంతో తనకు దుఃఖం వచ్చిందనీ, తన కళ్లల్లో నీళ్లు తిరిగాయనీ, బాగుండదని ఏడుపు ఆపుకొన్నానని ఆయనే స్వయంగా చెప్పారు. ఇప్పటికీ ఆ పిల్లలు నా కళ్లల్లో మెదులుతున్నారు అనాధలమని చెప్పుకొనే స్థితి రావడం తన మనసును కలిచివేసిందని సీఎం కె.చంద్రశేఖర్ రావు ఉద్వేగంగా మాట్లాడారు. మంగళవారం అనాధ పిల్లల చదువు, వసతి తదితర అంశాలపై సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. 
 
పదో తరగతి తర్వాత అనాధ పిల్లలకు ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు తెరవాలని అధికారులకు సీఎం సూచించారు. మొదటి రెసిడెన్షియల్ స్కూల్‌ను యాదగిరిగుట్టలో ప్రారంభించాలని, ఈ స్కూల్ శంకుస్థాపనకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ఆహ్వానించాలని ముఖ్యమంత్రి చెప్పారు. అనాధ పిల్లల భవిష్యత్తుకు ఏం చేయాలనే అంశాలను అధ్యయనం చేసేందుకు నియమించిన మంత్రివర్గ ఉప సంఘం వీలైనంత తొందరగా నివేదిక ఇవ్వాలని సూచించారు. 


Saturday, June 27, 2015

"బిడ్డ కోసం పాముతోనే ‘యుద్ధం’ చేసిన తల్లి"

ముంగిస, పాముల పోరాటం సాధారణమే. అయితే.. ముంగిస కథ పక్కనబెడితే.. ఓ కుందేలు ఆరడుగులపైగా పొడవున్న నల్లతాచుతో చేసిన పోరాటం మాత్రం అసాధారణం.. తన పిల్లలను కబళిస్తున్న ఓ తాచును తల్లి కుందేలు ధైర్యంగా ఎదుర్కొంది. 

ఆ కుందేలు బారినుంచి తప్పించుకునేందుకు ఆ తాచు ఎంతగా ప్రయత్నించినా ఫలితంలేకపోయింది. వీటిమధ్య ‘యుద్ధం’ సుమారు అరగంటపైగా సాగింది. చివరకు కుందేలు దాడిని ఎదుర్కోలేక తాచు పలాయనం చిత్తగించింది. 
నెట్‌లో ఈ వీడియో హల్‌చల్ సృష్టించింది.



Friday, June 26, 2015

"యాభై ఏళ్ళ"నుంచి తల్లిగర్భంలోనే "బిడ్డ"

యాభై ఏళ్ళనుంచి తల్లిగర్భంలోనే ఉండిపోయిన బిడ్డను డాక్టర్లు గమనించి బయటకు తీశారు. వివరాల్లోకి వెళితే...
 చిలీలోని శాన్ అంటోనియా సిటికి చెందిన హాప్పిటల్‌‌‌‌‌‌కు వచ్చిన 92 సంవ త్సరాల మహిళకు ఎక్స్‌‌‌రే తీశారు. దానిని పరిశీలిస్తే ఆమె గర్భంలో నాలుగు పౌండ్ల బరువుండి బాగా ఎదిగిన గర్భస్థ పిండాన్ని కనుగొన్నారు. అయితే అది మృతి చెందిఉన్నట్టు గమనించారు.
 ఎదిగిన పిండం గర్భంలోనే ఇలా గట్టిగా మారిపోవడాన్ని వైద్య పరిభాషలో ‘లిథోపిడియన్’ లేదా ‘స్టోన్ బేబీ’ అని పిలుస్తారని వైద్యులు తెలిపారు. మెడికల్ హిస్టరీలో ఇప్పటిదాకా ఇటువంటివి 300 కేసులు రిజిస్టర్ అయినట్టు డాక్టర్లుచెబుతున్నారు.


Tuesday, June 23, 2015

వ్యాయామం ఎక్కువైతే ప్రమాదమే ?

మనషి శరారీనికి వ్యాయామం ఎంతో మేలు చేస్తుందనే విషయం అందరికీ తెలిసిందే. ప్రతి రోజు అర గంట నుంచి ఒక గంట పాటు వ్యాయం చేయడం వలన హుషారుగా ఉండడమే కాకుండా ఆరోగ్యంగానూ ఉంటారు. అయితే అదే వ్యాయామం అధికమైతే మాత్రం ప్రమాదమేనట. ఆస్ట్రేలియాకు చెందిన ఆరోగ్య నిపుణులు ఇటీవల మనిషి వ్యాయామంపై పరిశోధనలు చేసి నివేదికను వెల్లడించారు. 
 
దాని ఆధారంగా చూస్తే.. వ్యాయామం అధికంగా చేయడం వలన ప్రేగుల నుంచి విడుదలయ్యే హానికర బ్యాక్టీరియా రక్తంలో కలుస్తుందని, ఇది ప్రమాదకరమని తెలుస్తోంది. ఈ బ్యాక్టీరియా అధిక మొత్తంలో రక్తంలో కలవడం వల్ల వ్యాధి నిరోధక శక్తికి ప్రతిబంధకాలు ఏర్పడతాయట. పూర్తి ఆరోగ్యవంతులపై పరిశోధనలు జరిపి ఈ వివరాలను వెల్లడించారు. కాబట్టి వ్యాయం కూడా మితంగా చేయడం మంచిదన్నమాట.