CSS Drop Down Menu

Saturday, March 18, 2017

ఈ ఏటీఎం కార్డుతో రోజుకు ఎన్నిసార్లు నగదు డ్రా చేసుకున్నా సర్వీస్ ఛార్జీలు పడవు!

బ్యాంకులు విధిస్తున్న నిబంధనలతో ఏటీఎం కేంద్రాల వైపు, బ్యాంక్ బ్రాంచిలవైపు చూసేందుకే వినియోగదారులు జంకుతున్నారు. ఈ పరిస్థితిని తపాలా శాఖ తనకు అనువుగా మార్చుకుంటోంది.
పోస్టాఫీసులో రూ.50తో అకౌంట్ ప్రారంభిస్తే చాలు.. వెంటనే ఏటీఎం కార్డు కూడా అందజేస్తామని, తమ ఏటీఎం కార్డు ద్వారా జరిపే లావాదేవీలపై ఎలాంటి సేవా రుసుములు విధించమని ప్రకటించుకుంటోంది.
దీని ప్రకారం.. కనిష్టంగా రూ.50 చెల్లించి తపాలా కార్యాలయాల్లో ఎవరైనా ఖాతా ప్రారంభించవచ్చు. పాస్ బుక్, ఏటీఎం కార్డు సౌకర్యం కలిగిన ఈ ఖాతాల ద్వారా సులభంగా నగదును తీసుకునే పథకాన్ని ప్రకటించింది.
 తపాలాశాఖ అధికారి ఒకరు మాట్లాడుతూ.. తపాలా ఏటీఎం కార్డును ఉపయోగించి ఏ పోస్టాఫీసు, ఏ బ్యాంకులకు చెందిన ఏటీఎంల నుంచైనా నగదు తీసుకోవచ్చని తెలిపారు.
ఈ ఏటీఎం కార్డుకున్న సౌలభ్యం ఏమిటంటే.. ఒకేరోజు ఎన్నిసార్లయినా నగదు డ్రా చేసుకోవచ్చు.. ఎన్నిసార్లు తీసుకున్నా ఎలాంటి సర్వీస్ ఛార్జీలు పడవు. బ్యాంకుల మాదిరిగానే తపాలా పొదుపు ఖాతాలకు 4 శాతం వడ్డీని అందిస్తున్నారు. పోస్ట్ పేమెంట్ బ్యాంకింగ్ అనే కొత్త పథకంలో డిపాజిట్లపై 4.5 నుంచి 5.5 శాతం వడ్డీని అందిస్తారు.

0 comments:

Post a Comment