ప్రయాణాల్లో ఉన్నప్పుడు, బయట తిరుగుతున్నప్పుడు సహజంగానే ఎవరైనా మినరల్ వాటర్ బాటిల్స్‌ను కొనుగోలు చేసి తాగుతారు. అది మంచిదే. పరిశుభ్రంగా ఉండే నీటిని తాగడం మనకు అవసరమే. అయితే అలా బాటిల్స్‌ను కొనేటప్పుడు ఒక్క విషయాన్ని మాత్రం ఖచ్చితంగా గమనించాల్సిందే. ఎందుకంటే అది మన ఆరోగ్యానికి సంబంధించినది. ఇంతకీ ఏంటది? అని అడగబోతున్నారా? అయితే చదవండి..
ఇకపై మీరు వాటర్ బాటిల్‌ను కొని తాగడానికి ముందు దాని కింద భాగాన్ని ఒకసారి చూడండి. ఏం కనిపిస్తాయి? పరిశీలించారా? అయితే జాగ్రత్తగా చూడండి. pp, hdpe, hdp, pete, pet, pvc, ldpe అని ఏవైనా ఆంగ్ల అక్షరాలు కనిపిస్తున్నాయా? అవును.. కనిపిస్తాయి. ఇంతకీ అవి ఎందుకు ప్రింట్ చేయబడి ఉంటాయో తెలుసా? ఆ వాటర్ బాటిల్ తయారుచేయబడిన ప్లాస్టిక్ పదార్థం అది. అంటే ఎన్నో రకాల ప్లాస్టిక్స్ ఉన్నాయి కదా.. వాటిలో ఏ తరహా ప్లాస్టిక్‌తో ఆ వాటర్ బాటిల్‌ను తయారు చేశారో తెలియజేస్తూ బాటిల్స్ కింద దానికి చెందిన లెటర్స్‌ను ప్రింట్ చేస్తారు. మరి వాటిలో మనకు ఏది సేఫో, ఏది హాని కలిగిస్తుందో ఇప్పుడు తెలుసుకుందామా..
pete లేదా pet
వాటర్ బాటిల్ కింద కనుక ఈ లెటర్స్ ప్రింట్ చేయబడి ఉంటే జాగ్రత్త. ఎందుకంటే ఈ ప్లాస్టిక్‌తో తయారుచేసిన వాటర్ బాటిల్స్‌లో నీరు పోస్తే ఆ నీటిలోకి ప్రమాదకరమైన విష పదార్థాలు విడుదలవుతాయట. ఆ క్రమంలో ఆ నీటిని తాగడం మనకు మంచిది కాదట.
hdpe లేదా hdp
వాటర్ బాటిల్ కింద కనుక ఈ లెటర్స్ ఉంటే అప్పుడు ఆ బాటిల్ లోని నీటిని మనం నిరభ్యంతరంగా తాగవచ్చు. ఆ నీటిలోకి ఎలాంటి ప్లాస్టిక్ అవశేషాలు చేరవట. అవి పూర్తిగా సురక్షితమైనవట. కాబట్టి వాటర్ బాటిల్స్ కొనేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటున్నారు వైద్యనిపుణులు.
నా బ్లాగ్ ను ఆదరిస్తున్న వీక్షకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరచుకొంటున్నాను. అలాగే నాయొక్క "YOUTUBE" Channel ను కూడా చూసి ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. నేనుపెట్టే వీడియోలు మీకు నచ్చినట్లయితే "Like" మరియు "Subscribe" చేసుకొంటారని కోరుకుం టున్నాను.
నాయొక్క "YOUTUBE" Channel link క్రింద ఇస్తున్నాను. క్లిక్ చేయండి.
https://www.youtube.com/channel/UCSL1cNEbkoqeLIr7NupqMyw/videos
https://www.youtube.com/channel/UCSL1cNEbkoqeLIr7NupqMyw/videos
0 comments:
Post a Comment