CSS Drop Down Menu

Wednesday, March 15, 2017

గవర్నర్ నరసింహన్‌కు కేసీఆర్ రూ.50 కోట్ల గిఫ్ట్ ?

రాష్ట్రం విడిపోయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి రాష్ట్రాలకు గతంలో ఉన్న ఈ.ఎస్.ఎల్.నరసింహన్‌ను నియమించింది. అయితే రెండు రాష్ట్రాల విషయంలోనూ ఆచితూచి వ్యవహరించిన నరసింహన్ తెలంగాణా రాష్ట్రం విషయంలో కాస్త ఎక్కువగా కేర్ తీసుకున్నారన్నదే రాజకీయ విశ్లేషకుల భావన. కేసీఆర్ గవర్నర్ కాళ్ళకు మొక్కడంతోనే ఒక్కసారిగా గవర్నర్‌కు ఆయనపై ప్రేమ ఒక్కసారిగా పెరిగిందనేది రాజకీయ విశ్లేషకుల భావన. కానీ చంద్రబాబునాయుడు పరిస్థితి అలాక్కాదు. అయితే ప్రస్తుతం గవర్నర్ నరసింహన్ త్వరలో రిటైర్డ్ అవుతున్నారు. దీంతో కేసీఆర్ గవర్నర్‌కు పెద్ద గిఫ్ట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అది కూడా ఒకటి రెండు కాదు ఏకంగా కోట్ల రూపాయల విలువ చేసే గిఫ్ట్.. ఏంటది.. అనుకుంటున్నారా.. అయితే చదవండి.

నరసింహన్ అత్యున్నత స్థాయి వృత్తి నిపుణత, నిజాయతీ కలిగిన పోలీస్ అధికారి. సాధారణ డిఎస్‌పి నుంచి ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ వరకు ఎన్నో పదవులు నిర్వహించారాయన. అందుకు గుర్తింపుగా, రిటైర్ అయిన తర్వాత గవర్నర్‌గా నియమించింది కేంద్ర ప్రభుత్వం. ఒక సాధారణ డిఎస్‌పిగా రాజకీయవాదులకు సెల్యూట్ కొట్టిన రాష్ట్రంలోనే, ముఖ్యమంత్రి చేత నమస్కారం పెట్టించుకొనే గవర్నర్ హోదా సంపాదించడంతోనే ఆయన జీవితం సార్ధకమైంది.

ఇప్పుడు నరసింహన్ పదవీ విరమణ చేయబోతున్నాడు. హైదరాబాదుతో ఆయన బంధం చాలా తక్కువ. కానీ, రిటైర్ అయిన తర్వాత ఆయన హైదరాబాదులోనే స్థిరపడేటట్లు ఒప్పించారట కేసీఆర్. అందుకోసం గచ్చిబౌలి సమీపంలో ఒక ఎకరా విస్తీర్ణంలో, దాదాపు 50 కోట్ల రూపాయల విలువైన రాజభవనం వంటి ఇల్లు కట్టించి ఇవ్వనున్నారట. ఈ మూడేళ్లపాటు తనకు చేసిన ఉపకారానికి కేసీఆర్ ఇస్తున్న కానుక ఇదని అంటున్నారు. వృత్తి జీవితమంతా నీతికి, నిజాయితీకి కట్టుబడిన నరసింహన్ అంత భూరి కానుక స్వీకరించడానికి సిద్ధంగా వున్నారో లేదో అనే చర్చ జరుగుతోంది.


1 comment:

  1. . . . . వృత్తి జీవితమంతా నీతికి, నిజాయితీకి కట్టుబడిన నరసింహన్ . . .

    నరసింహన్ గారు నిజాయితీగానే గవర్నర్ గిరీ చేసారంటారా? ఆయన గవర్నర్ హోదా ప్రయోజనం ఆయన తీర్థయాత్రలకే హెచ్చుగా పరిమితం ఐనది. రాజకీయంగా ఐతే ఆయన తెలంగాణా గవర్నర్ మరియు ఆంధ్రాకు తప్పనిసరి మొక్కుబడి గరర్నర్ అన్నట్లుగా వ్యవహరించారు. ఇది ఆయన నిజాయితీగా వ్యవహరించారన్న దానికి అపవాదంగా ఉంది. ఇక కేసీఆర్ గారు ఒక మహారాజు గారు - ఆ బిరుదం కుదరదు కాబట్టి ఆయన ఒక ముఖ్యమంత్రి అంతే. ఆయన వ్యవహారశైలి అది.

    ReplyDelete