
ఉదయాన్నే జీలకర్ర నీటిని ఇలా తాగితే చాలు ఎలాంటి కొవ్వు అయినా కరిగిపోతుందట. జీలకర్రను నిత్యం మనం వంటకాల్లో ఎక్కువగా వాడుతుంటాం. దీనివల్ల ఆయా వంటలకు చక్కని రుచి, వాసన వస్తుంది. అయితే జీలకర్ర మనకు ఆ విధంగానే కాదు, ఆరోగ్యాన్ని పరిరక్షించే ఔషధంగా కూడా పనిచేస్తుంది. ఎందుకంటే దీంట్లో అనారోగ్య సమస్యలను తరిమికొట్టే ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ క్రమంలో జీలకర్రతో తయారుచేసిన నీటిని రోజూ ఉదయాన్నే పరగడుపున తాగితే దాంతో ఎన్నో అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చని...