అరటి పండు.. ఈ పండును ఇష్టపడని వారంటూ ఉండరు. భోజనం చేశాక విధిగా ఆరగిస్తారు. దీనికి కారణం ఇందులో పోషకాలు పుష్కలంగా ఉండటమే కాకుండా తీసుకున్న ఆహారాన్ని తేలికగా జీర్ణం చేసే శక్తి ఉంది. అయితే, పచ్చటి అరటిపండు మేలా... నల్లటి మచ్చలున్న అరటిపండ్లు మంచిదా అనేది ఇక్కడ పరిశీలిద్ధాం.
బాగా పండిన అరటి పండు తొక్కపై నల్లటి మచ్చలు ఉంటాయి. ఎన్ని నల్లటి మచ్చలు ఉంటే ఆ పండు అంత బాగా పండిందని అర్థం. ఈ మచ్చలు ఉండే అరటిపండును ఆరగించడం వల్ల శరీరంలో చెడు కణాలను నివారిస్తుంది.
తెల్ల రక్త కణాలను వృద్ధి చేసి.. రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. స్ట్రాచ్‌ను చక్కెరగా మారుస్తుంది. ఇది తీసుకున్న ఆహారాన్ని తేలికగా జీర్ణం చేస్తుంది. శరీరంలో చక్కెర శాతాన్ని పెంచుతుంది. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉండటం వల్లే మచ్చలున్న అరటి పండు ఆరగించడం ఎంతోమేలని వైద్యులు సూచన చేస్తున్నారు.
0 comments:
Post a Comment