CSS Drop Down Menu

Monday, January 16, 2017

"ఖైదీ నంబర్ 150" కొన్ని సీన్లపై మురుగ‌దాస్ అస‌హ‌నం !

తమిళ దర్శకుడు ఏ.ఆర్.మురుగదాస్. అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్‌లో ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న డైరక్టర్. ఈ దర్శకుడు తెరకెక్కించే చిత్రాలు సూపర్ డూపర్ హిట్లు కావాల్సిందే. అలాంటిదే తమిళంలో వచ్చిన "కత్తి" చిత్రం. ఈ చిత్రంలో విజయ్ హీరోగా నటించాడు. ఈ చిత్రాన్నే మెగాస్టార్ చిరంజీవి తెలుగులో "ఖైదీ నంబర్ 150" పేరుతో రీమేక్ చేశారు. 

అయితే, ఈ సినిమా చూసిన మురుగ‌దాస్ అస‌హ‌నం వ్య‌క్తం చేశాడ‌ట‌. అందుకు మంచి కారణం ఉందట. ఈ చిత్ర ప్రదర్శనను వీక్షించిన మురుగదాస్ స్పందిస్తూ సినిమా అంతా బాగానే ఉందని అన్నాడు. అందులో క‌నిపించిన‌ కొన్ని సీన్లపై మాత్రం అభ్యంత‌రంగా ఉన్నాయన్నారు. సాధారణంగా తాను తీసే సినిమాలో కొన్ని విలువ‌లు ఉండాల‌ని కోరుకుంటానని, అందుకే తన చిత్రాల్లో ఆల్కహాల్‌ సీన్లు దాదాపుగా ఉండకుండా చూస్తానని వ్యాఖ్యానించాడట. 

అందుకే తమిళ 'కత్తి' చిత్రంలో కనీసం విలన్ కూడా ఆల్క‌హాల్ తీసుకోడు. కేవ‌లం టీ, కాఫీలను మాత్ర‌మే హీరోలు, విలన్లు సేవిస్తుంటారు. కానీ, తెలుగు 'ఖైదీ'లో మాత్రం ఏకంగా హీరోయే లిక్కర్‌ సీన్లు చేయడం ఆయ‌న‌కు నచ్చలేదట. దీంతో పాటు క‌మెడియ‌న్‌ అలీతో సినిమాలో ఆడవేషం వేయించిన తీసిన‌ కామెడీ కూడా ఆయనకు అసంతృప్తి కలిగించినట్టు తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్టు సమాచారం. 

1 comment:

  1. . . . హీరోయే లిక్కర్‌ సీన్లు చేయడం . . . అలీతో సినిమాలో ఆడవేషం వేయించిన తీసిన‌ కామెడీ . . .

    మరి మాస్ కదండీ మన హీరోగారి సినిమా? ఎంత ఎబ్బెట్టుగా ఉంటే అంత గొప్ప మాస్ అన్నమాట. వెకిలితనమే కదా మన తెగులుసినిమాలో కామెడీ అంటే? పాపం ఈ మురుగదాస్ కాస్త చాదస్తుళ్ళా ఉన్నాడు. నేటి తెలుగుసినిమాలో విలువలా!

    ReplyDelete