అమ్మాయిలు.. ఆడవాళ్లతో మర్యాదగా మెలగాలని వారిని వేధించకూడదని చెప్పారు బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్. ఈ విషయం తన కుమారులు ఆర్యన్, అబ్‌రామ్‌లకు పదేపదే చెబుతానన్నారు. స్త్రీలను గౌరవించాలని.. ఆడవారితో మాట్లాడేటప్పుడు వారిని నువ్వు, గివ్వు అని అనకూడదని తమ పిల్లలకు నేర్పుతున్నట్టు షారూఖ్ తెలిపాడు. అంతేకాదు, ఈ విషయంలో ఒకవేళ తమ కుమారులు తప్పు చేస్తే వారి తలలు తీసేస్తానని వ్యాఖ్యానించాడు. ఇటీవల బెంగళూరులో యువతులపై జరిపిన దాడులమీద ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించిన షారుక్ ఖాన్ పిల్లల్ని తల్లిదండ్రులు హద్దుల్లో ఉంచి పెంచాలని సూచించాడు.
0 comments:
Post a Comment